మేకప్‌ ఉత్పత్తులతో జాగ్రత్త!

21 Apr, 2018 00:25 IST|Sakshi

అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి మహిళలు మేకప్‌ ఉత్పత్తులపై ఆధారపడుతుండటం మామూలే. ఈ ఉత్పత్తుల వల్ల అందం మెరుగయ్యే మాట అలా ఉంచితే, హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆస్ట్రేలియన్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందం కోసం అలవాటుగా వాడే మేకప్‌ ఉత్పత్తులు కొందరిలో హార్మోన్ల తీరుతెన్నులను అస్తవ్యస్తంగా మార్చేస్తాయని మెల్‌బోర్న్‌కు చెందిన ఫెర్టిలిటీ–హార్మోన్‌ నిపుణురాలు నాట్‌ క్రింగౌడిస్‌ చెబుతున్నారు.

స్కిన్‌కేర్, హెయిర్‌కేర్‌ ఉత్పత్తులు, ఫేస్‌వాష్‌లు, కృత్రిమ పరిమళాలతో తయారయ్యే స్ప్రేలు, సెంట్లు వంటివి హార్మోన్‌ సమస్యలతో పాటు కొందరిలో ఊపిరితిత్తుల సమస్యలు కూడా కలిగిస్తాయని ఆమె అంటున్నారు. మేకప్‌ ఉత్పత్తుల్లోని రసాయనాలు చర్మం ద్వారా శరీరంలోకి చేరి, హార్మోన్లపై ప్రభావం చూపుతాయని వివరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు