శుభాకాంక్షలకు వేదిక

26 Feb, 2014 01:27 IST|Sakshi
శుభాకాంక్షలకు వేదిక

ఫేస్‌బుక్ విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో భావోద్వేగాలతో కూడిన ఉదంతాలకు కూడా వేదికవుతోంది. తన ఈడు పిల్లలతో కలవలేకపోతున్న కుమారుడిని ఫేస్‌బుక్ ద్వారా మురిపించింది

 

ఒక తల్ల అమెరికాలోని మిషిగాన్‌కు చెందిన కొలిన్(10) ఆటిజం బాధితుడు. దీంతో అతడికి స్నేహితులెవరూ లేరు. స్నేహితులు లేని పుట్టిన రోజు వేడుక తనకు వద్దన్నాడు. తల్లి జెన్నిఫర్ గుండె ద్రవించింది. వెంటనే ఫేస్‌బుక్‌లో కొలిన్ పేరు మీద పేజీని ప్రారంభించి, షేర్ చేయాల్సిందిగా నెటిజన్లను అభ్యర్థించింది. ఫేస్‌బుక్‌లో 14 లక్షలమంది కొలిన్‌ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. మరి కొందరు గ్రీటింగ్ కార్డులు పంపించారు. టీవీ చానళ్లు కొలిన్ గురించి, అతడి ఫేస్‌బుక్ ఫ్యాన్స్ గురించి కథనాలు ప్రసారం చేశాయి. కొలిన్ ఇలా వార్తల్లో వ్యక్తి అయ్యాడు.
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు