మొటిమలు, మచ్చలను కరివేపలా తీసేయండి!

25 May, 2017 01:11 IST|Sakshi
మొటిమలు, మచ్చలను కరివేపలా తీసేయండి!

వేసవిలో ముఖంపైన వచ్చే చిన్న చిన్న గుల్లలను సులువుగా తొలగించుకునేందుకు కరివేపాకు తోడ్పడుతుంది.
గుప్పెడు కరివేపాకులను మెత్తగా దంచి, దానికి చిటికెడు పసుపు చేర్చాలి. ఆ ముద్దని మొటిమలు ఉన్నచోట రాస్తే అవి తగ్గుతాయి.
గుప్పెడు కరివేపాకులు మెత్తగా చేసి, దానికి చెంచాడు ముల్తానీమట్టి, చెంచాడు రోజ్‌వాటర్‌ కలపాలి. దానిని ముఖానికి రాసి పదినిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు, వలయాలు తొలగిపోయి, మన ముఖం మనకే ముచ్చటేసేలా మెరిసిపోతుంది.
రెండు చెంచాల కరివేపాకు ముద్దకు మూడుచెంచాల ఆలివ్‌ ఆయిల్‌ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, మెడకీ రాసి పావుగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం మీద, మెడమీద ఉన్న నలుపు విరిగిపోయి, చర్మం మిలమిలలాడుతుంది.
రెండు చెంచాల కరివేపాకు ముద్దకు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చి నల్లటిమచ్చలు ఉన్న చోట రాయాలి. పదినిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల తాలూకు మచ్చలు మటుమాయం అవుతాయి.

మరిన్ని వార్తలు