పిల్లలకు మంచిమాటలు నేర్పిస్తున్నారా?

14 Mar, 2018 00:28 IST|Sakshi

సెల్ఫ్‌ చెక్‌

సమాజం అభివృద్ధి అనుకరణతోనే సాగింది. ముఖ్యంగా భాష పెంపొందేది దీనితోనే. పిల్లలు ‘అమ్మ’ అనమంటే ‘అమ్మ’ అంటారు. ‘ఆవు’ అనమంటే ‘ఆవు’ అంటారు. ఇంటిలోనే భాష సరిగా లేకుంటే పిల్లలకు ఎలా వస్తుంది? కొన్నిసార్లు ఇంటిలో ఎలాంటి తప్పుమాటలు మాట్లాడకపోయినా పిల్లలు అక్కడక్కడ విని నేర్చుకుంటారు. ఇలాంటి అలవాటును మొదటిలోనే మాన్పిస్తే పిల్లలకు మంచి భాష అలవడుతుంది. మీ పిల్లలూ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మాన్పించే ప్రయత్నం చేస్తున్నారా?  

1.    పిల్లలు తప్పు మాట్లాడిన వెంటనే దాన్ని సవరిస్తారు. 
    ఎ. అవును     బి. కాదు 

2.    తప్పు మాటలు మాట్లాడేటప్పుడు పట్టించుకోకుండా, వారిని మీ అటెన్షన్‌లోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. 
    ఎ. అవును     బి. కాదు 

3.    పిల్లలకు చెప్పే ముందు మీరూ అలాంటి మాటలు మాట్లాడరు. 
    ఎ. అవును     బి. కాదు 

4.    చెడ్డమాట స్థానంలో మంచిమాట మాట్లాడిన ప్రతిసారీ ఏదైనా బహుమతి ఇస్తామని ప్రామిస్‌ చేస్తారు.
    ఎ. అవును     బి. కాదు 

5.    పిల్లలు ఇలాంటి మాటలను చాలా చోట్ల నుంచి వింటారు కాబట్టి వారిని అర్థం చేసుకొని, అలాంటి పదాల నష్టం ఏమిటో వివరిస్తారు. 
    ఎ. అవును     బి. కాదు 

6.    పిల్లల ప్రవర్తనలో మార్పు రాకపోతే కొంచెం ఘాటుగా స్పందించటానికి వెనకాడరు.  
    ఎ. అవును     బి. కాదు 

7.    తప్పు మాట్లాడిన ప్రతిసారీ ఒక రూపాయి కాయిన్, రూమ్‌లో అమర్చిన జార్‌లో వేయాలని చెప్తారు. (దీన్నో గేమ్‌లాకాక పనిష్మెంట్‌లా ఉపయోగిస్తారు) 
    ఎ. అవును     బి. కాదు 

8.    చెడ్డమాటలకు బదులు నవ్వు తెప్పించే పదాలు ఉపయోగించటం నేర్పిస్తారు.  
    ఎ. అవును     బి. కాదు 

9.    పిల్లలు అలాంటి మాటలను ఎక్కడనుంచి నేర్చుకుంటున్నారో గమనించి ఆ సోర్సును ఆపేస్తారు.
    ఎ. అవును     బి. కాదు 

10.    మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు నవ్వరు. నవ్వు వారిని ఎంకరేజ్‌ చేస్తుందని మీకు తెలుసు. 
    ఎ. అవును     బి. కాదు 

‘ఎ’ లు ఏడు దాటితే పిల్లల తప్పుమాటలు మాన్పించటానికి ప్రయత్నిస్తారు. ఇదేవిధంగా వారిలో మంచి ప్రవర్తన కలగటానికి ప్రయత్నించండి. ‘బి’ లు ‘ఎ’ ల కన్నా ఎక్కువగా వస్తే పిల్లల్లో మంచిమాటలు నేర్పించటానికి ఎలాంటి ప్రయత్నాలు చేయరు. ‘ఎ’ లను సమాధానాలుగా చేసుకొని పిల్లల ప్రవర్తనలో మార్పు తీసుకురావటానికి ప్రయత్నించండి.  

మరిన్ని వార్తలు