రోజుకు ఎనభై!

26 Dec, 2017 23:30 IST|Sakshi

మామూలుగానే చాలామందిలో ప్రతిరోజూ 50 నుంచి 80 వెంట్రుకల వరకు రాలిపోవడం సహజం. కాగా... గర్భధారణ సమయంలోనూ, ప్రసవం తర్వాత ఇది మరీ ఎక్కువ. గర్భధారణ సమయంలో జుట్టుకు అవసరమైన ఐరన్, ఫోలిక్‌ యాసిడ్, ఇతర విటమిన్లు, పోషకాలు దారి మళ్లి కడుపులోని బిడ్డకు అందుతుంటాయి. దాంతో అవసరమైన పోషకాలు అందక జుట్టు రాలిపోతుంటుంది.  అలాగే ప్రవసం తర్వాత మహిళల్లో  జుట్టు ఎక్కువగా రాలి తలకట్టు పలచబారిపోతుంది.

గర్భధారణ సమయంలోనూ, ప్రవసం వల్ల వారు అనుభవించే శారీరక ఒత్తిడి జుట్టు రాలడానికి ఒక ప్రధాన కారణమైతే... ప్రసవం తర్వాత మహిళల్లో స్రవించాల్సిన హార్మోన్లు నార్మల్‌కు వచ్చే వరకు వారిలో హార్మోన్ల అసమతౌలత్య కొనసాగుతుంటుంది. ఇది జుట్టు రాలడానికి మరొక  కారణమవుతుంది. డాక్టర్‌ను సంప్రదించి తగిన ఐరన్‌ సప్లిమెంట్లు, మల్టీవిటమిన్‌లు జుట్టుకు అందేలా  చూడటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. 

మరిన్ని వార్తలు