హెల్త్‌ టిప్స్‌

31 Aug, 2017 00:18 IST|Sakshi
హెల్త్‌ టిప్స్‌

పచ్చికూరలు ఉప్పునీరు


పచ్చి కూరగాయలు, ఆకులను తినే ముందు వాటిని తప్పనిసరిగా ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో కడగాలి. వాటిని పండించేటప్పుడు చల్లిన క్రిమిసంహారక మందుల అవశేషాలు, పొలం నుంచి ఇంటికి వచ్చే వరకు అవి చేసే ప్రయాణంలో వాటినాశించిన రకరకాల క్రిమికీటకాలు, దుమ్ముధూళి చన్నీటితో కడిగితే పూర్తిగా పోవు. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే పచ్చి కూరగాయలతో వచ్చే ఆరోగ్యం కంటే ముందు పురుగు మందుల ప్రభావంతో సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తాయి.
     
ముఖం మీద బ్లాక్‌ హెడ్స్, మొటిమలు వస్తుంటే నూనెలో వేయించిన ఆహారాన్ని పూర్తిగా మానేయాలి. ఆహారంలో తాజా పండ్లు, పచ్చికూరగాయలతో చేసిన సలాడ్లు,  మొలకెత్తిన గింజలు, మీగడ లేని పెరుగు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు పోయి అనవసరమైన కొవ్వు శరీరంలోకి చేరకుండా చర్మం తాజాగా ఉంటుంది.

మరిన్ని వార్తలు