పేరులో నేముంది

15 Oct, 2015 23:54 IST|Sakshi
పేరులో నేముంది

చిరుధాన్యాలలో మేలిమి... రాగులు...
 
చిరుధాన్యాలలో ఒకటైన రాగి పంటకు కీటకాలు, చీడపీడల సమస్య చాలా తక్కువట. అందుకేనేమో రాగులను ఆహారంగా చేసుకుంటే మన ఒంటికీ అనారోగ్యసమస్యలు చాలా తక్కువ అని అంటుంటారు. ఒకప్పుడు పేదల ఆహారంగా రాగులకు పేరు ఉండేది. కానీ, నేడు అనారోగ్యం దరిచేరకుండా ఉండాలంటే రాగులనే ప్రధాన ఆహారంగా ఎంచుకోవాలి అనేవారి సంఖ్య సంపన్నుల్లోనూ పెరుగుతోంది. అందుకే, రాగి అంబలిగానే పరిచయం ఉన్న వీటితో ఇప్పుడు రకరకాల వంటకాలను సృష్టిస్తున్నారు.

రుచికరంగా రాగులను తెగ లాగించేస్తున్నారు. రాగులను సాధారణంగా వేరుశనగ, కంది, మినుము వంటి పప్పు దినుసులతో పాటు అంతరపంటగా సాగుచేస్తారు. దీనిని ఎక్కువగా ఆఫ్రికా, ఆసియాలోని మెట్టప్రాంతాలలో పండిస్తారు. రాగి పుట్టింది మాత్రం ఇథియోపియాలోని ఎత్తై ప్రదేశాలలో అని, నాలుగువేల సంవత్సరాల క్రితం మన దేశంలో ప్రవేశపెట్టబడింది అని తెలుస్తోంది. ఎత్తు ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితుల్లోనూ తట్టుకుని సులువుగా పండే పంట ఇది. చల్లనైన హిమాలయపర్వతసానువుల్లో 2,300 మీటర్ల ఎత్తువరకు రాగిని పండిస్తారట!
 
 

>
మరిన్ని వార్తలు