పరిపరి శోధన

15 Oct, 2015 23:51 IST|Sakshi
పరిపరి శోధన

పావురాల కళాదృష్టి
 
మనుషులకే కాదు, పావురాలకూ కళాదృష్టి ఉంటుందట! బాల కళాకారులు సృష్టించే కళాఖండాలలో బాగున్నవేవో, బాగులేనివేవో అవి ఇట్టే గుర్తు పట్టేస్తాయని జపాన్‌లోని కీయో వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడానికి వాళ్లు కొన్ని పరీక్షలు కూడా చేశారు. చిన్న పిల్లలతో గీయించిన బొమ్మల్లో బాగున్నవి, బాగులేనివి మొదట కొందరు మనుషులతో వేరు చేయించారు.

తర్వాత, కాస్త శిక్షణ ఇచ్చిన పావురాలతో అదే పని చేయించారు. ఇలా కొన్నిసార్లు జరిపిన పరీక్షల్లో బొమ్మల్లో బాగున్నవి, బాగులేనివి పావురాలు తేలికగానే గుర్తించాయని ఈ పరిశోధకులు చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు