ఆ రెండు బాధ్యతలూ నెరవేర్చినవాడే ముస్లిమ్‌

7 Jun, 2017 23:33 IST|Sakshi
ఆ రెండు బాధ్యతలూ నెరవేర్చినవాడే ముస్లిమ్‌

రమజాన్‌ కాంతులు

నవుల మనుగడ కోసం దేవుడు ఈ ప్రపంచంలో రకరకాల సంపదలు సృష్టించాడు. అందుకని మనిషి దైవానికి కృతజ్ఞుడై ఉండడంతోపాటు, ఆ సంపదలోని కొంతభాగాన్ని నిరుపేదలైన సాటిమానవ సోదరులకు కూడా అందజేయాలి. ఆర్థిక స్థోమత కలిగినవారు తమ వద్దనున్న ధన కనక, వస్తు పశుసంపదలో ప్రతి సంవత్సరం రెండున్నర శాతం చొప్పున తీసి పేదలసాదల హక్కు చెల్లించాలి. ఇదే జకాత్‌. అంతేకాకుండా ధాన్యం, అపరాలు, పండ్లు, కూరగాయలు తదితర భూ ఉత్పత్తుల నుండి కూడా జకాత్‌ తీయవలసి ఉంటుంది. దీన్ని ‘ఉష్ర్‌’ అంటారు. సంవత్సరానికి ఎన్నిపంటలు పండిస్తే అన్నిసార్లు ఉష్ర్‌ తీసి పేదసాదలకు పంచాలి.

వర్షాధార పంటల నుండి అయితే పదిశాతం, ఖర్చుతో కూడుకున్న నీటిపారుదల సౌకర్యం వల్ల పండే పంటలైతే ఐదుశాతం చొప్పున ఉష్ర్‌ తీయవలసి ఉంటుంది. ఇదేవిధగా పశుసంపదపై కూడా జకాత్‌  చెల్లించాలి. ఇస్లామ్‌ ధర్మం మానవులపై రెండురకాల బాధ్యతలను మోపుతుంది. ఒకటి: దేవుని హక్కులు. రెండు: దాసులహక్కులు. నమాజు మనిషిని దేవుని హక్కులు నెరవేర్చేందుకు సమాయత్తపరిస్తే, జకాత్‌ దాసుల హక్కులు నెరవేర్చడం గురించిన బాధ్యతాభావాన్ని జనింపజేస్తుంది. ఈ రెండు హక్కుల్ని సక్రమంగా నెరవేర్చడాన్నే ఇస్లామ్‌ అని, అలా నెరవేర్చినవారినే ముస్లిమ్‌ అని అంటారు.
–  ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

>
మరిన్ని వార్తలు