Sakshi News home page

ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తాం 

Published Tue, Nov 28 2023 5:30 AM

Amit Shah Comments On Muslim reservations At Public Meeting - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల, సాక్షి,పెద్దపల్లి/హుజూరాబాద్‌: ‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్‌ ప్రభుత్వం ముస్లింలకు అమలు చేస్తున్న 4 శాతం రిజర్వేషన్లు ఎత్తేసి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు కేటాయిస్తాం’అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. సింగరేణి కార్మీకుల ఇన్‌కం ట్యాక్స్‌ రద్దు చేస్తామని హామీనిచ్చారు. సోమవారం మంచిర్యాలలో నిర్వహించిన ‘సకలజనుల విజయ సంకల్ప యాత్ర’లో పెద్దపల్లి జిల్లాకేంద్రం, కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లలో జరిగిన రోడ్‌ షోలలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, కేసీఆర్‌ మధ్య మ్యాచ్‌ ఫిక్స్‌ంగ్‌ ఉందని అమిత్‌ షా ఆరోపించారు.

గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి జంప్‌ అయ్యారనీ, ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులు మళ్లీ గెలిస్తే కేసీఆర్‌ దగ్గరకే వెళ్తారని జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చి, బీఆర్‌ఎస్‌ పార్టీ కారును గ్యారేజీకి పంపే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. ఒవైసీకి భయపడే సీఎం కేసీఆర్‌ సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరపడం లేదని, తాము అధికారంలోకి రాగానే అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. సామాజికంగా వెనుకబడిన మాదిగలకు ఎస్సీ వర్గీకరణతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతికి పాల్పడిన కేసీఆర్‌తో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారందరినీ జైలుకు పంపిస్తామని అమిత్‌ షా అన్నారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటే ...  
బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని ఆ పార్టీలకు ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి కుంటుపడుతుందని అమిత్‌షా అన్నారు. పేదల తరఫున మాట్లాడినందుకే ఈటల రాజేందర్‌పై కేసీఆర్‌ కక్ష పెంచుకొని పార్టీ నుంచి బయటకు పంపారని నిందించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచి్చన తర్వాత ధాన్యానికి మద్దతు ధర రూ.3100 ఇస్తామని ఆయన హామీనిచ్చారు. 

Advertisement

What’s your opinion

Advertisement