-

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ‌మైనారీటీ ఓట్ల భయం.. గెలుపుకు గండి!

27 Nov, 2023 10:51 IST|Sakshi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ బీజేపీకి ఊపునిచ్చింది. ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ప్రభంజనంలా తరలివచ్చిన జనంతో జైత్రయాత్రను‌‌ మరిపించింది. కానీ బీజేపీని  ఓడించడానికి ముస్లింలు, మైనారీటీలు ఏకం అవుతున్నారా.? కారు పార్టీకి మైనారీటీలు మళ్లీ అండగా నిలబడుతారా? లేదంటే కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారా? ఓట్ల‌ చీలిక మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని ఓటమి నుండి గట్టేక్కిస్తుందా? అసలు మైనారీటీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ‌మైనారీటీ ఓట్ల భయంపై స్పెషల్‌ స్టోరీ.

నిర్మల్ ‌నియోజక వర్గంలో ఎన్నికల పోరు ఉత్కంఠను  రేపుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి ఇంద్రకరణ్  రెడ్డి మూడోసారి పోటీ  చేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కూచడి శ్రీహరిరావు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు ఎన్నికలలో గెలవాలని విస్తృతంగా ప్రచారం‌‌ నిర్వహిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ముగ్గురు హేమాహేమీలు నువ్వా.. నేనా రీతిలో  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

నిర్మల్‌లో నిర్వహించిన సభకు ప్రదాని నరేంద్ర మోదీ హజరయ్యారు. మోదీ సభ. సూపర్ సక్సైసైంది. ఈ సభతో విజయం ఖాయమని మహేశ్వర్ రెడ్డి భావిస్తున్నారట. కానీ  ముస్లిం మైనారిటీల ఓట్లు దడ పుట్టిస్తున్నాయట. నియోజకవర్గంలో రెండు  ‌లక్షల ముప్పై వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో ముప్పై అయిదు వేల నుంచి నలబై వేల వరకు ముస్లిం మైనారీటీల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను  ప్రభావితం చేస్తాయి. ఈ ఓట్లను దక్కించుకోవడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కూచడి ‌శ్రీహరిరావు  విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
చదవండి: రైతుబంధుకు ఈసీ బ్రేక్‌.. మంత్రి హరీశ్‌రావే కారణం

గత అసెంబ్లీ ఎన్నికలలో ముస్లింలు బడార్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. ఈసారి ముస్లింలలో  ప్రభుత్వంపై  వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కారణంగా ‌ముస్లింలు కాంగ్రెస్ వైపు ‌ చూపుతున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో ముగ్గురు ఒకరికంటే ఒకరు ప్రజల మద్దతు కూడగట్టడానికి పోటీ పడుతున్నారు. ముస్లింల ఓట్లు ‌కాంగ్రెస్ వైపు ‌మొగ్గు చూపుతారా లేదంటే బీఆర్‌ఎస్‌ వైపు వెళ్తారనేది ఉత్కంఠను రేపుతుంద‌ట. బీజేపీని ఓడించడానికి ఒకవేళ గెలిచే కాంగ్రెస్ వైపు వెళతారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు ఉంటే  కారు పార్టీ వైపు  ఓట్లు వేసే అవకాశం ఉంది. బీజేపీని ఓడించటమే ముస్లిం‌ లక్ష్యం. ఆరునూరైనా  బీజేపీ విజయం సాదించవద్దని ముస్లింలు బావిస్తున్నారట.

అయితే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మద్య ముస్లిం ఓట్ల చీలిక ఉంటుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఇది తనకు కలిసి వస్తుందని బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి భావిస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థి స్వర్ణ రెడ్డికి 16,900 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ‌చేస్తే‌ 70,714 ఓట్లు వచ్చాయి. ఈ. ఎన్నికలలో మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఆయన చేరికతో నియోజకవర్గంలో బీజేపీకి ఊపు, ఉత్సాహం వచ్చింది. గత పార్లమెంటు ఎన్నికలలో కూడా నిర్మల్ నియోజకవర్గంలో ‌‌బీజేపీ వైపు ప్రజలు భారీగా‌ మొగ్గు చూపారు. ఎంపీగా సోయంబాపురావు మెజారిటీ విజయం సాదించారు.  పార్లమెంటు ఎన్నికల ఊపు మళ్లీ ఉంటుందని తన విజయం ఖాయమని మహేశ్వర్ రెడ్డి  బావిస్తున్నారట.

బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటంతో తన విజయానికి ఎదురులేదని మహేశ్వర్ రెడ్డి అనుకుంటున్నారట. కానీ బీజేపీ విజయాన్ని అడ్డుకోవడానికి మైనారిటీలు ఏకం అవుతున్నారట. మహేశ్వర్ రెడ్డి ఓటమే లక్ష్యంగా మైనారిటీలు ఎత్తగడలు వేస్తున్నారట. ఓట్ల చీలిక నివారించి గెలిచే కారు, కాంగ్రెస్ ఓట్లు వేయాలని ముస్లింలు భావిస్తున్నారట.ఇప్పటికే నిర్మల్‌లో ఎంఐఎం మంత్రికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తోంది. మంత్రి కూడ ముస్లింల మద్దతు కూడగడుతున్నారట. బీఆర్‌ఎస్‌ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేయాలని మైనారిటీలను మంత్రి కోరుతున్నారట. మైనారీటీలు కూడా బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం‌‌ ఉంది. ముస్లింలు గంపగుత్తగా ఓట్లు వేస్తే మంత్రి విజయం ఖాయమని తెలిందట.

మైనారీటీలు ఎకంగా మహేశ్వర్ రెడ్డికి దడ పుట్టిస్తోందట. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మద్య ఓట్ల చీలికతో గట్టేక్కాలనుకున్నా ఆశలు అవిరవుతున్నాయట. విజయంపై ఆశలు సన్నగిల్లుతున్నాయట. అయితే ఏది ఏమైనా పార్లమెంటు ఎన్నికల మాదిరిగా ఈసారి విజయం ఖాయమని బావిస్తున్నారట.‌ ముస్లిం మైనారీటలు ఎకమైనా, ఎంతమంది తన విజయాన్ని అడ్డుకోవడానికి కుట్రలు పన్నినా తన విజయాన్ని ఏవరు అపలేరంటున్నారట మహేశ్వర్ రెడ్డి. మరోకవైపు సర్కారు వ్యతిరేకత, మైనారిటీ ఓట్లతో  కూచడి ధీమాతో ఉన్నారట. ఈ‌ ముగ్గురిలో ఏవరు  విజయం సాధిస్తారో చూడాలి

మరిన్ని వార్తలు