తప్పక తినండి

15 Apr, 2015 23:14 IST|Sakshi

ఆరోగ్యం

ఏ ఆహార పదార్థంతోనైనా ఒకటో రెండో ఉపయోగాలు ఉంటాయి. కానీ ఖర్జూరంతో మాత్రం చెప్పలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే వెంటనే మీ ఆహారంలో ఖర్జూరాన్ని చేర్చేస్తారు.ఖర్జూరాలు మలబద్దకాన్ని నివారిస్తాయి. వీటిలో ఉండే ప్రత్యేక రసాయనం జీర్ణశక్తిని మెరుగుపర్చడమే కాక, పేగు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కడుపులో ఉండే హానికర బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

ఖర్జూరంలో ఉండే సోలబుల్, ఇన్‌సోలబుల్ ఫైబర్స్ పొట్ట నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. ఆకలిని తగ్గించి, ఎక్కువ ఆహారాన్ని తినకుండా అడ్డుకుంటాయి. అలాగే వీటిలో ఉండే ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి నేచురల్ షుగర్స్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఖర్జూరంలో ఉంటే పొటాషియం, సల్ఫర్ శరీరంలోని కొవ్వును విచ్ఛిన్నం చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే కచ్చితంగా ఖర్జూరాలు తినమంటున్నారు డాక్టర్లు.

మరిన్ని వార్తలు