ఇలాగైతే కాలేయవ్యాధులు గుండెజబ్బులను మించుతాయి!

4 Dec, 2017 16:26 IST|Sakshi

మన సమాజంలో ఉన్న మద్యం దురలవాటుతో పాటు ఇటీవలి ఆధునిక జీవనశైలిలో బాగా విస్తృతమైన స్థూలకాయాన్ని నియంత్రించుకోకపోతే కాలేయ వ్యాధులు పెరిగి వాటితో మరణాలూ తప్పవని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. మద్యపానం, అదేపనిగా బరువు పెరగడాన్ని మనమే ప్రయత్నపూర్వకంగా నియంత్రించుకోకపోతే ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న గుండెజబ్బుల మరణాల సంఖ్యను కాలేయవ్యాధితో కలిగే మరణాలు అధిగమిస్తాయని హెచ్చరిస్తున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ సౌథాంప్టన్‌ పరిశోధకులు.

ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్‌ నిక్‌ షెరాన్‌ అనే అధ్యయనవేత్త మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ ఈ మరణాలు మధ్యవయసు వారి నుంచి క్రమంగా తగ్గుతూ తాజాగా చిన్న వయసులోనే చాలా మంది గుండెజబ్బులతో అకస్మాత్తుగా కన్నుమూయడం వరకు వచ్చింది. అయితే పెరుగుతున్న మద్యం దురలవాటు, బాగా బరువు పెరుగుతూండటం కారణాలతో  2020 నాటికి ఇలా చిన్నవయసులోనే మరణించేవారి సంఖ్య కాలేయవ్యాధిగ్రస్తుల్లోనే ఎక్కువగా ఉంటుంది’’ అంటూ హెచ్చరిస్తున్నారు. ఇటీవలే ఈ అధ్యయన ఫలితాలు ప్రముఖ  మెడికల్‌ జర్నల్‌ ‘ద లాన్సెట్‌’లో ప్రచురితమయ్యాయి. 

మరిన్ని వార్తలు