వేసవి.. దుర్వాసనకు చెక్...

2 Apr, 2015 23:05 IST|Sakshi
వేసవి.. దుర్వాసనకు చెక్...

వేసవిలో పాదాలు, బాహుమూలల్లో చెమట అధికంగా పడుతుంది. దుర్వాసన కూడా వస్తుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా వెనిగర్, నీళ్లు సమాన భాగాలుగా కలిపి, స్ప్రే చేసి, తుడుచుకోవాలి. తర్వాత డియోడరెంట్ వాడాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసన, ఎలాంటి ఇరిటేషన్ సమస్య రాదు.

ఎండ వల్ల చర్మం నిస్తేజంగా కనిపిస్తే... రెండు టీ స్పూన్ల తేనెలో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు రాసుకొని మసాజ్ చేయాలి. ఎండ వల్ల పొడిబారిన చర్మానికి జీవకళ వస్తుంది. మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్య లేపనంలా పనిచేస్తుంది.
 

మరిన్ని వార్తలు