వేసవిలో వంటగది పరీక్ష!

15 Apr, 2014 23:51 IST|Sakshi
వేసవిలో వంటగది పరీక్ష!

 జాగ్రత్తగా...
 మరో వారంలో పిల్లలకు పరీక్షలయిపోతాయి.పెద్దవాళ్లకు పరీక్షలు మొదలవుతాయి. పిల్లలకు రోజంతా ఖాళీ. ఓ గడుగ్గాయి గ్యాస్ బర్నర్ తిప్పేసి వెళ్లిపోతాడు. మరో పాపాయి మిక్సీ ఎలా పనిచేస్తుందో గమనించడానికి ఆన్ చేసి చూస్తుంది. వేసవికాలంలో వంటగది ప్రమాదాలు ఎక్కువ. అందుకే చిన్నపిల్లలున్న ఇంట్లో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
 
 పిల్లలు ఆడుకుంటూ ఇంట్లో పరుగులెత్తేటప్పుడు వంటగదిలోకి రానివ్వకూడదు  స్టవ్ మీద వంటపాత్రల హ్యాండిల్స్‌ని లోపలి వైపుకు ఉంచాలి, ప్లాట్‌ఫామ్ బయటకు వచ్చేలా పెట్టకూడదు  వంట మధ్యలో ఉన్నప్పుడు ఫోన్ వస్తే స్టవ్ ఆపేసి వెళ్లాలి  గదిలో నీళ్లు, నూనె, వంట పదార్థాలు ఒలికితే వెంటనే తుడవాలి .
 
 పిల్లలు ఇంట్లో ఉన్న సమయాల్లో వంట పూర్తవగానే రెగ్యులేటర్ కట్టేయాలి మిక్సీ, గ్రైండర్, ఒవెన్‌ల వాడకం పూర్తయిన వెంటనే ప్లగ్ నుంచి వేరు చేయాలి .పదేళ్లు నిండిన పిల్లలకు వంటగదిని అలవాటు చేయడానికి ఇదే సరైన సమయం. అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వదులు దుస్తులు వేయకూడదు, ఏప్రాన్ వేయాలి హోల్డర్, చాకు, పీలర్‌లను సరిగ్గా పట్టుకోవడం, వాడిన వెంటనే ఒకచోట పెట్టడం అలవాటు చేయాలి. ఒవెన్, ఫ్రిజ్ వాడకం చూపించాలి.

మరిన్ని వార్తలు