అధికారం తలకెక్కుతుందట!

14 Dec, 2015 01:02 IST|Sakshi
అధికారం తలకెక్కుతుందట!

పరిపరి శోధన

అధికారం కిక్కు తలకెక్కితే, అది ఒక పట్టాన దిగదట. అధికారంలో ఉన్నా, లేకున్నా స్థిమితంగా ప్రవర్తించడం స్థితప్రజ్ఞులకే చెల్లుతుంది. సామాన్యుల పరిస్థితి అలా కాదు కదా! అధికారం దక్కాక ఎంతో కొంత దర్పాన్ని ప్రదర్శించడం మామూలే. అయితే, కొందరు అతిగా దర్ప ప్రదర్శన చేస్తుంటారట. వారి సంభాషణలు సాధారణంగా వన్‌వే ట్రాఫిక్‌లాగే ఉంటాయని, ఎదుటి వారి మాటలు వినిపించుకోకుండా, తాము చెప్పదలచుకున్నదే చెబుతూ పోతారని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇలాంటి వారికి అధికారంతో పాటే ఆధిక్యతా భావం పెరుగుతుందని, దాంతో ఇతరులను చులకనగా చూస్తారని తమ పరిశోధనల్లో తేలినట్లు కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు