ఈ వేసవికి మేలైన ఎంపిక...

9 May, 2015 00:22 IST|Sakshi
ఈ వేసవికి మేలైన ఎంపిక...

ఫ్యాషన్ టిప్స్‌
 
వేసవిలో సింథటిక్ దుస్తులు ధరిస్తే చెమటకు ఇరిటేషన్ కలుగుతుంది. ర్యాష్ వస్తుంది.  వీలైనంతగా ప్రకృతి సిద్ధమైన రంగులు, ప్రింట్లు ఉన్న కాటన్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకుంటే మేలు. ఈ కాలానికి తగ్గట్టుగా మనకు అందుబాటులో ఉన్న కలంకారీ, మంగళగిరి, ప్లెయిన్ మల్ మల్, ప్రింటెడ్ మల్ మల్, కోరా, ఛీజ్ కాటన్, ఖాదీ కాటన్‌లు... తక్కువ రేటుకే లభిస్తాయి. చర్మానికి సౌకర్యంగా ఉంటాయి.
 
కూల్ కలర్స్...

వేసవిలో ముదురు రంగుల మీద అంత ఆసక్తి ఉండదు. అందుకని ఏ రంగువైనా మీడియం, లేత రంగులను ఎంచుకోవాలి. అంటే పచ్చను ఇష్టపడే వారు లేత పచ్చ, ఎరుపు అయితే లైట్ ఆరెంజ్, బ్లూ అయితే లైట్ బ్లూ... ఇలా స్‌లక్ట్ చేసుకోవచ్చు.
 
ఎంబ్రాయిడరీ వద్దు...


 కాటన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ రెండు మూడు నెలలకే ఉపయోగపడుతుంది. అదీ తక్కువ రేటు ఫ్యాబ్రిక్ మీద ఎక్కువ ఖర్చుపెట్టి హెవీగా ఎంబ్రాయిడరీ చేయించుకునే కన్నా క్రోషియా, జర్దోసీ, క్లాత్, నెట్...లేసులు వాడి చూడముచ్చటగా డిజైన్ చేసుకోవచ్చు.
 
 

మరిన్ని వార్తలు