22న సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై శిక్షణ

17 Dec, 2019 02:51 IST|Sakshi

సేంద్రియ పద్ధతిలో గొర్రెలు, మేకల పెంపకంపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో రైతులకు ఈ నెల 22(ఆదివారం)న శిక్షణ ఇవ్వనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్‌ అధ్యక్షుడు డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన నిపుణులు డా. జి. రాంబాబుతోపాటు గొర్రెలు, మేకల పెంపకంలో అనుభవజ్ఞులైన రైతులు శిక్షణ ఇస్తారన్నారు. ముందుగా పేర్లు నమోదు చేసుకోగోరే వారు సంప్రదించాల్సిన నంబర్లు: 970 538 3666, 0863–2286255

22న కాకినాడలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ
గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన కలిగించే లక్ష్యంతో సొసైటీ ఫర్‌ అవేర్‌నెస్‌ అండ్‌ విజన్‌ ఆన్‌ ఎన్విరాన్‌మెంట్‌(సేవ్‌) స్వచ్ఛంద సంస్థ ఈ నెల 22 (ఆదివారం)న కాకినాడ విద్యుత్‌నగర్‌లోని చల్లా ఫంక్షన్‌ హాల్‌ (వినాయకుడి గుడి ఎదుట)లో ఉ. 8.30 గం. నుంచి సా. 5.30 గం. వరకు రైతులకు శిక్షణ ఇవ్వనుంది. ప్రకృతి వ్యవసాయం అంటే ఏమిటి? పెట్టుబడి, ఖర్చులు తగ్గించుకునే మార్గాలు, రైతులు పంట దిగుబడులను మొత్తం నేరుగా అమ్ముకోకుండా కొంత మోత్తాన్ని విలువ ఆధారిత ఉత్పత్తులగా మార్చి అమ్ముకోవడం, అధికాదాయం కోసం ప్రయత్నాలు, దేశీ విత్తనాల ఆవశ్యకత, దేశీ ఆవు విశిష్టత తదితర అంశాలపై సేవ్‌ సంస్థ వ్యవస్థాపకులు, ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్‌ శిక్షణ ఇస్తారు. ప్రవేశ రుసుము: ఒక్కొక్కరికి రూ. వంద. ఆసక్తి గల రైతులు ముందుగా తమ పేర్లను ఫోన్‌ చేసి నమోదు చేసుకోవాలి.. వివరాలకు.. సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ సమాచార కేంద్రం: 04027654337, 86889 98047 94495 96039

మార్చిలో జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ
భూతాపోన్నతిని శాశ్వత వ్యవసాయ (పర్మాకల్చర్‌) పద్ధతుల్లో సమర్థవంతంగా ఎదుర్కొనే మార్గాలపై రైతాంగంలో చైతన్యం తెచ్చే లక్ష్యంతో వచ్చే ఏడాది మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు జాతీయ శాశ్వత వ్యవసాయ మహాసభ జరగనుంది. తెలంగాణలోని జహీరాబాద్‌ దగ్గర్లోని బిడకన్నె గ్రామంలో అరణ్య పర్మాకల్చర్‌ అకాడమీలో ఈ మూడు రోజుల మహాసభ జరగనుందని అరణ్య శాశ్వత వ్యవసాయ సంస్థ తెలిపింది.

20న ప్రకృతి సేద్య పద్ధతుల్లో కూరగాయల సాగుపై శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కూరగాయల సాగుపై కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ కొత్తూరు తాడేపల్లిలోని రామరాజు గారి వ్యవసాయ క్షేత్రంలో ఈ నెల 20 (శుక్రవారం)న ఉ. 10 గం. నుంచి సా. 5 గం. వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆం. ప్ర. శాఖ తరఫున రైతులకు శిక్షణ ఇవ్వనున్నారు. కూరగాయల సాగులో కొత్త పద్ధతులను అనుసరిస్తున్న సీనియర్‌ రైతులు అనుభవాలను పంచుకుంటారు. వివరాలకు.. 78934 56163

మరిన్ని వార్తలు