ప్రయాణం పడటం లేదా?

11 May, 2015 23:49 IST|Sakshi
ప్రయాణం పడటం లేదా?

ట్రావెల్
 
కొందరికి ప్రయాణాలంటే భయం ఉంటుంది. ప్రయాణాల్లో తల తిరగడం, కడుపులో తిప్పి వాంతి అవడం, విపరీతంగా చెమటలు పట్టడం వంటి సమస్యలే అందుక్కారణం. రెండు నుంచి 12 ఏళ్ల పిల్లలు, గర్భవతులు, మైగ్రేయిన్ వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య అధికం.
     
ఎక్కువ మోతాదులో ఆహారం, పానీయాలు తీసుకోకూడదు. మసాలాలు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం ప్రయాణానికి ముందు తీసుకోకూడదు.
     
కారులో కూర్చునేటప్పుడు వీలైనంత వరకు ముందు సీటునే ఎంచుకోవాలి. విండో అద్దాలను పూర్తిగా మూసేయకుండా బయటి గాలిని పీల్చుకుంటూ ఉండాలి.
     
తల తిరిగినా, వాంతి వచ్చినట్టు అనిపించినా అల్లం, యాలకులు, లవంగం, వాము వంటివి బుగ్గన పెట్టుకోవాలి. తలను వెనక్కు వాల్చి, కళ్లు మూసుకొని ఏదైనా అందమైన ప్రదేశంలో ఉన్నట్టు ఊహించుకోవాలి. లేదంటే, నిద్రపోవడానికి ప్రయత్నించాలి.
 

మరిన్ని వార్తలు