వాయుకాలుష్యంతో వాళ్లకూ చేటు...

28 Jan, 2016 23:04 IST|Sakshi
వాయుకాలుష్యంతో వాళ్లకూ చేటు...

పరిపరి   శోధన

పట్టణ వాతావరణంలోని వాయుకాలుష్యం వల్ల మనుషులందరికీ చేటేననే సంగతి తెలిసిందే. కాలుష్యానికి నేరుగా బహిర్గతమయ్యే వారికి మాత్రమే వాయుకాలుష్యం వల్ల అనర్థాలు తలెత్తుతాయని ఇంతవరకు భావిస్తూ వచ్చారు. అయితే, గర్భస్థ శిశువులకు సైతం వాయుకాలుష్యం తీరని హాని చేస్తోందని తాజా పరిశోధనల్లో తేలింది.

ఆరునెలలు నిండిన గర్భిణులు పట్టణ కాలుష్యంలో గడిపినట్లయితే, వాహనాల నుంచి వెలువడే పొగ ద్వారా గర్భస్థ శిశువు ఊపిరితిత్తుల్లోకి ప్రమాదకర రసాయనాలు చేరుతాయని యూనివర్సిటీ ఆఫ్ సిన్‌సినాటీలోని సిన్‌సినాటీ చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ సెంటర్ కు చెందిన వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెలలు నిండకుండానే ప్రసవాలు జరిగే పరిస్థితి ఉంటుందని, ఒక్కోసారి మృతశిశువులు జన్మించే ప్రమాదం కూడా ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు