అతిపెద్ద పాదరక్ష | Sakshi
Sakshi News home page

అతిపెద్ద పాదరక్ష

Published Thu, Jan 28 2016 11:04 PM

అతిపెద్ద పాదరక్ష

తిక్క లెక్క

ఇది ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాదరక్ష. దీనిలో పాదాలేం ఖర్మ ఏకంగా మనుషులే అవలీలగా పట్టేస్తారు. దీని పొడవు 6.40 మీటర్లు, వెడల్పు 2.39 మీటర్లు, ఎత్తు 1.65 మీటర్లు మాత్రమే. ఈ సైజు పాదాలు ఎవరికీ లేనప్పుడు ఈ పాదరక్షను ఎందుకు తయారు చేశారంటారా..? ఆ మాత్రం తెలీదూ..! కూసింత ప్రచారం కోసం... వీలుంటే ఒక రికార్డు కోసం... హాంకాంగ్‌లోని ఎలక్ట్రిక్ సెక్కీ సంస్థ దీనిని రూపొందించి, గిన్నెస్ రికార్డు సాధించింది.

ఈ సంస్థ ఉత్పత్తి చేసే ‘సూపర్‌గా 2750’ మోడల్ పాదరక్షలను మార్కెట్‌లోకి విడుదల చేసిన సందర్భంగా ఆ మోడల్‌కు నమూనాగా దీనిని రూపొందించింది. ఆశించినట్లే ప్రచారానికి ప్రచారం... రికార్డుకు రికార్డు సాధించింది.
 
 

Advertisement
Advertisement