ఒకచోట ఉండదు

23 Sep, 2018 01:15 IST|Sakshi

యూట్యూబ్‌ స్టార్‌

సెజల్‌..  ‘‘జబ్‌  హ్యారీ మెట్‌ సెజల్‌’’ కాదు.. యూట్యూబర్‌.. సెజల్‌ కుమార్‌. జస్ట్‌ 23 ఏళ్లు.. యూట్యూబ్‌ వీక్షకులకు ‘యాపిల్‌ ఆఫ్‌ ఐ’. దేశంలో ఫస్ట్‌ జనరేషన్‌ లైఫ్‌స్టయిల్‌ ‘‘ఇన్‌ఫ్లుయెన్సర్‌’’. ఈమె యూట్యూబ్‌ చానల్‌కు ఎనిమిది లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు.

ఎవరీ సెజెల్‌?  ... ఢిల్లీ వాసి. డాక్టర్‌ అంజలీ కుమార్, అనిల్‌ కుమార్‌ ఆమె తల్లిదండ్రులు. తల్లి డాక్టర్‌. తండ్రి రిటైర్డ్‌ ఆర్మీ మేజర్‌. సెజల్‌కు ఒక అన్న రోషన్‌. ఆర్మీ కుటుంబం కాబట్టి ఇంట్లో చాలానే స్ట్రిక్ట్‌గా ఉండేదట. ఇంటర్‌ వరకూ సెజల్‌ చాలా సిగ్గు, బిడియంతో ఉండేది. ఎంతో దగ్గరి సన్నిహితులతో తప్ప బయటవాళ్లతో పెద్దగా కలిసేది కాదట.  కాని దగ్గరి వాళ్లతో మాత్రం అల్లరిచేస్తూ.. చిలిపిగా ఉండేదట! అయితే శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఢిల్లీ యూనివర్శిటీ)లో డిగ్రీ చేస్తున్నప్పుడు సెజల్‌ ఆలోచన మారింది.

టర్కీకి వెళుతుండగా..!
స్టూడెంట్‌ ఎక్సే్ఛంజి ప్రోగ్రామ్‌ కింద టర్కీకి వెళ్లే అవకాశం వచ్చింది సెజల్‌కు. మొదటి నుంచీ వీడియోగ్రఫీ అంటే క్రేజ్‌ సెజల్‌కు. అప్పటికే తన దగ్గరున్న వీడియోతో తనకు నచ్చినవి తీస్తూ ఉండేది. అందుకే  టర్కీకి వెళ్లేముందు ఓ కెమెరా కొనివ్వమని అడిగింది తల్లిదండ్రులను.  అక్కడ తన పరిశీలనలను వీడియోలో బంధించింది. అలాగే టర్కీలో సీజన్‌ ఫ్యాషన్‌ను  కాప్చర్‌ చేసింది.  ఎడిటింగ్‌ చేసి ‘‘సమ్మర్‌ స్టయిల్‌ ఇన్‌ టర్కీ’’ అనే పేరుతో ఓ వీడియోను పోస్ట్‌చేసింది యూట్యూబ్‌లో. చాలానే రెస్పాన్స్‌ వచ్చింది. అప్పుడు తెలిసిపోయింది సెజల్‌కు తన గమ్యం ఏమిటో! టర్కీ నుంచి వచ్చాక యూట్యూబ్‌ చానల్‌నే ప్రధాన వ్యాపకంగా పెట్టుకుంది. వెయ్యిమంది వ్యూయర్స్‌తో స్టార్టయిన ఆమె చానల్‌ ఇప్పుడు.. పైన చెప్పుకున్నాం కదా.. ఎనిమిది లక్షల మందికి చేరుకుంది!

లైఫ్‌ స్టయిల్‌.. సామ్‌సంగ్‌
సెజల్‌ బ్లాగ్‌ కూడా రాస్తుంది. బ్లాగ్‌ కన్నా కూడా తన వీడియోలకు కంటెంట్‌ రాసుకోవడాన్నే ఎక్కువ ఆస్వాదిస్తా అంటుంది. యూట్యూబ్‌లో ఆమె వీడియో ట్రైలర్స్‌ చూసే ‘‘అరే ఇది సెజల్‌ తీసిన వీడియో కదా’’ అనుకునేంత ఫాలోయింగ్‌ ఆమెది. అదీ సెజల్‌ స్టయిల్‌ ఆఫ్‌ మేకింగ్‌. ఆమె వీడియోలకున్న క్రేజ్‌ చూసే లైఫ్‌స్టయిల్, సామ్‌సంగ్‌ కంపెనీలకు ఎండార్స్‌ చేసే చాన్సెస్‌ ఆమె ఇంటి కాలింగ్‌ బెల్‌ నొక్కాయి. ‘‘ఊహించని అచీవ్‌మెంట్‌’’ అంటుంది సెజల్‌. యూట్యూబ్‌ స్టార్‌ ‘బెథాని మోటా’ సెజల్‌కు రోల్‌మోడల్‌. తన చానల్‌ సబ్‌స్క్రైబర్స్‌తో మాట్లాడ్డం.. వాళ్ల కామెంట్స్‌కు రిప్లయ్‌ ఇవ్వడం అంటే సెజల్‌కు చాలా ఇష్టం.

ఫ్యాషన్‌ వీడియోస్‌తోపాటు, స్కెచెస్, ట్రావెలాగ్స్, డాన్స్, మ్యూజిక్‌ వీడియోలూ ఆమె యూ ట్యూబ్‌చానెల్‌లో ఉంటాయి. ‘‘వెనక్కి తిరిగి చూసుకుంటే నేనేనా అనిపిస్తుంది. షైగా ఉండేదాన్ని. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ డయాస్‌ మీద కూడా కనపడుతున్నాను. థ్యాంక్స్‌ టు మై ఫ్యాన్స్‌. వాళ్లు లేకపోతే నేను ఇలా ఉండేదాన్ని కాదేమో’’ అంటుంది ఈ ఆంట్రప్రెన్యూర్‌.

మరిన్ని వార్తలు