అతిగా నీరు తాగితే కోమాలోకి వెళ్లే ప్రమాదం

30 Oct, 2017 09:20 IST|Sakshi

క్యాన్‌బెరా: అతి ఏదైనా అనర్థమే అన్నది నూటికి నూరుపాళ్ళు నిజమే అంటున్నారు పరిశోధకులు. ప్రాణాధారంగా భావించే నీరే కొన్నిసార్లు ప్రాణాలను తీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. శరీరం అవసరానికి మించి నీరు తాగితే వాంతులు, కళ్ళు తిరగడం వంటివి సంభవించి కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీనిమీద ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్‌ యూనివర్శిటీ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు.

కొంతమందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు చేత అవసరం లేకున్నా నీరు తాగించారు. మరొక గ్రూపు చేత అవసరం ఉన్నంత మేరకే నీరు తాగించారు. అనంతరం రెండు గ్రూపుల వారి ఆరోగ్యాన్ని పరీక్షించారు. అవసరానికి మించి నీరు తాగిన వారిలో వాంతులు, వికారం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. రెండో గ్రూపులో అలాంటివి కనిపించలేదు. మొదటి గ్రూపు వారిలో కనిపించిన లక్షణాలను ఏ మాత్రం ఆలస్యం చేసినా కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.


water, coma, body, danger

మరిన్ని వార్తలు