కృతుంగ...తెలుగింటి వంట

13 Dec, 2014 23:41 IST|Sakshi
కృతుంగ...తెలుగింటి వంట

హైదరాబాదీల దిల్ పసంద్ పాయా చూడగానే జుర్రేయాలనిపిస్తుంది. మారుమిల్లి వెదురు బొంగు చికెన్... మాటల్లేవ్! టేస్ట్ చేయాల్సిందేనని తొందరపెడుతుంది. రాగి సంకటి ముద్ద, దాని మీద ఓ నేతి చుక్క... నంజుకోవడానికి నాటు కోడి కూర సీమ వాసులని నోరూరిస్తోంది. పల్నాడు, నైజాం కోడి బిర్యానీ, చెన్నూరు మాంసం పలావ్... ఇలా అచ్చంగా మనవైన వంటలు.. సజ్జరొట్టె, జొన్న రొట్టె, కొర్రన్నం... అన్నీ మన ఊరి వంటలు. ఇవన్నీ ఒకే చోట లాగించేయాలంటే... నగరంలోని కృతుంగ రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే...
 
జంక్ ఫుడ్స్‌మయం అయిన మహానగరంలో అచ్చమైన తెలుగు రుచులు కనుమరుగయ్యే పరిస్థితిని గమనించి... 2002లో సీటీఓ లింగారెడ్డి ఓ చిన్న ప్రయత్నం చేశారు. అదే ‘కృతుంగ’ రెస్టారెంట్. ఆ తర్వాత నరేందర్‌రెడ్డి... ఆ చిన్న ప్రయత్నానికి సంకల్పాన్ని, దిశను నిర్దేశిస్తూ ఎన్నో రెస్టారెంట్లుగా విస్తరింపచేశారు. నగరవాసులకు తెలుగింటి రుచులను అందిస్తూ... వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది ఇప్పుడు కృతుంగ. చిన్న అవుట్‌లెట్‌గా ప్రారంభమై నేడు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో 13 బ్రాంచీలతో భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది.
 
సెలబ్రిటీలకు కేరాఫ్...

జూనియర్ ఎన్టీఆర్, రోజా, అలీ, సుమా, ఎస్వీ కృష్ణారెడ్డి, అనూప్ రూబెన్స్, అక్కినేని, కృష్ణంరాజు ఫ్యామిలీస్, ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు... ఇలా అనేక మంది ప్రముఖులు, సామాన్యులు ఇష్టపడే ఫుడ్ పాయింట్ ఇది. 2002లో పంజాగుట్టలో ప్రారంభమైన కృతుంగా... తన బ్రాంచీలు విస్తరిస్తూ జూబ్లీహిల్స్, ఎర్రమంజిల్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, మణికొండ, కూకట్‌పల్లి, కొండాపూర్, జూబ్లీహిల్స్... ఇలా సిటీలోని అన్ని ప్రధాన సెంటర్లకూ విస్తరించింది.
 
రుచికరమైన ఆహారానికి నాణ్యమైన దినుసులు ఎంతో ముఖ్యం. వంట సరుకులన్నీ సొంతంగా పండించిన వాటి నుంచి తెప్పించి ఇక్కడ వండి వారుస్తున్నారు. ఎండు మాంసం కర్రీస్ జూబ్లిహిల్స్ బ్రాంచ్ స్పెషల్. ఇది నగరంలో మరెక్కడా దొరకదు.
 
ఆహారంతో ఆరోగ్యాన్ని బలి చేస్తున్న ఈ రోజుల్లో... జంక్ ఫుడ్ బదులు కాల్షియంతో కూడిన ఆరోగ్యవంతమైన ఆహారం అందించాలనేదే మా ఉద్దేశం. రాగి, జొన్న, నూనె తక్కువగా ఉండే వెరైటీలు, మట్టి కుండలో వంటలు... ఇలా అన్నీ మన ప్రాంతాల్లో చేసుకునే వంటలే. 1000కు పైగా ఉద్యోగులు మా రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. వీళ్లందరినీ వివిధ ప్రాంతాల నుంచి తెచ్చి, ఇక్కడి పనుల్లో శిక్షణ కూడా ఇస్తున్నాం. పసుపు నుంచి రాగుల వరకూ స్వయంగా పండించినవే ఇక్కడ వాడతాం. ఇలా పదిమందికి ఉపాధి, మంచి ఆహారం అందించడమే మా లక్ష్యం’ అంటారు కృతుంగా రెస్టారెంట్స్ ఎండీ టి.నరేందర్‌రెడ్డి.
 
ఇటీవలే బెంగళూరులోని జయ్ నగర్‌లో 3వ బ్రాంచి ప్రారంభించారు. మున్ముందు బెంగళూరులో 6, పుణే, చెన్నయ్ సహా సౌత్ ఇండియాలో మరో 20 బ్రాంచీలు ప్రారంభించే యోచనలో ఉన్నట్టు ఆయన చెప్పారు. వీటితో పాటు అమెరికాలోనూ ప్రారంభిస్తామన్నారు. ఫుట్‌బాల్ వంటి అనేక ఆటల పోటీలు, ఈవెంట్లు, సెలబ్రిటీల ఫంక్షన్లకు ఇక్కడి నుంచే ఫుడ్ ఆర్డర్స్ వెళ్తుంటాయి.
 
2009లో కింగ్‌ఫిషర్ నిర్వహించిన వంటల పోటీలో బెస్ట్ ఫుడ్ అవార్డు, 2008లో ఫోర్బ్ జాబితాలో రాష్ట్రంలో టాప్ బెస్ట్ రెస్టారెంట్‌గా గుర్తింపు సంపాదించుకుని ప్రత్యేకతను చాటుకుంది ‘కృతుంగ’.
 
 kritunga@gmail.com
 ph: 9000633918

- ఓ మధు
 

మరిన్ని వార్తలు