బాగా బతకాలంటే ఇవి తెలుసుకోండి..!

16 Oct, 2019 07:17 IST|Sakshi

నేడు ప్రపంచ ఆహార దినోత్సవం 

తిండి కలిగితే కండ కలదోయ్‌.. కండ కలవాడే మనిషోయ్‌.. అని అప్పుడెప్పుడో ఓ మహాకవి కవితలు అల్లేశారు గానీ.. ఈ కాలంలో ఇదో సమస్య. ఏం తినాలి? ఏం తినకూడదన్న అవగాహన చాలా మందిలో లేదు అందుకే అటు పట్టణాల్లో.. ఇటు పల్లెల్లోనూ రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి పెచ్చరిల్లుతున్నాయి. నేడు ‘ప్రపంచ ఆహార దినోత్సవం’సందర్భంగా తిండి సంగతులు కొన్ని చెప్పుకుందాం..

  • చురుకైన, జబ్బుల ప్రమాదం తక్కువగా ఉన్న జీవితం కావాలనుకుంటున్నారా? అయితే సురక్షితమైన, పోషకాలతో కూడిన, వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోండి.
  • పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలతో పాటు గింజలు, విత్తనాలు, పల్లీలు, శనగలు, ఉలవలు, బొబ్బర్లు, జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ వీలైనంత రోజూ తీసుకోండి.
  • భారతీయులు రోజూ కనీసం 400 గ్రాముల కాయగూరలు, పండ్లు తీసుకోవాలని భారత పోషకాహార సంస్థ చెబుతోంది. రాగులు, జొన్నలు, వరి, గోధుమ వంటి ధాన్యాన్ని మరపట్టించకపోవడం మేలు. కొవ్వులు, మరీ ప్రత్యేకంగా సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు వాడకాన్ని మితంగా ఉంచుకోవడం మేలు.
  • ఆరోగ్యంలో పౌష్టికాహారం పాత్ర ఎంత ఉందో.. తగు మోతాదులో రోజూ వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం.
  • మరిన్ని వివరాల కోసం జాతీయ పోషకాహార సంస్థ సిద్ధం చేసిన వెబ్‌పేజీ  http://te.vikaspedia.in/health/nutrition చూడండి. ఏ ఆహారంతో ఎలాంటి ప్రయోజనం ఉంటుందో. కొన్ని ఆరోగ్య సమస్యలను ఆహారంతో ఎలా అధిగమించవచ్చో ఇందులో విపులంగా అందించారు.
  • మీరు తినే ఆహారంతో ఎన్ని కేలరీలు అందుతున్నాయో తెలుసు కోవాలనుకుంటే..  http://count&what&you&eat.ninindia. org:8080/CountWhatYouEat/Receipes.do లింక్‌ వాడండి. 

మీకు తెలుసా..?

  • భూమ్మీద మనిషి తినగలమొక్క జాతుల సంఖ్య 30,000
  • సాగవుతున్న పంటల సంఖ్య 200
  • 50 శాతం కేలరీలు అందిస్తున్న పంటలు 8 రకాలు  (బార్లీ, బీన్స్, వేరుశనగ, మొక్కజొన్న, బంగాళదుంప,, వరి, జొన్న, గోధుమ)
  • ఊబకాయ సంబంధిత ఆరోగ్య సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ఏటా ప్రభుత్వాలు పెడుతున్న 140లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి
  • అసాంక్రమిక వ్యాధులతో జరిగే మరణాల్లో అనారోగ్యకరమైన ఆహారం , శారీరక శ్రమలేమితో జరిగేవి ముందు వరుసలో ఉన్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య 82కోట్లు
  • పోషకాహార లోపం కారణంగా సామర్థ్యానికి తగ్గట్టు ఎదగని ఐదేళ్లలోపు పిల్లలు 14.9కోట్లు
  • అధిక ఆహారం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఐదేళ్ల లోపు పిల్లలు 4.9కోట్లు
  • ఊబకాయ సమస్యతో ఉన్న వాళ్లు 67కోట్లు
  • ఊబకాయులైన (5 –19 మధ్య వయస్కులు) పిల్లల సంఖ్య 12కోట్లు
  • ఊబకాయులుగా ఉన్న ఐదేళ్లలోపు పిల్లలు 4కోట్లు
మరిన్ని వార్తలు