పప్పుతో ముప్పేమీ లేదు!

24 Jan, 2016 02:03 IST|Sakshi
పప్పుతో ముప్పేమీ లేదు!

 అవాస్తవం
 ఒంటి మీద ఏదైనా పెద్ద గాయం ఉంటే పప్పులు తినవద్దంటారు పెద్దలు. అయితే పప్పు తినడం వల్ల గాయూలకు చీమ్ పడుతుందనేది కేవలం అపోహ మాత్రమే. నిజానికి గాయూన్ని వేగంగా వూన్పేందుకు సహాయుం చేస్తాయి పప్పులు.  వూంసాహారంలో ఏ పోషకం ఉంటుందో... పప్పుల్లోనూ అదే ఉంటుంది. అదే ప్రొటీన్. పైగా శాకాహారంలోని ప్రొటీన్లు లభించే పదార్థాల్లో పప్పులదే అగ్రస్థానవుని చెప్పవచ్చు. గాయుం వేగంగా వూనుబట్టడానికి జరగాల్సిన కణవిభజన ప్రక్రియుకు కూడా ఈ ప్రొటీన్లు ఎంతో అవసరం. అందుకే శస్త్రచికిత్స తర్వాత ఆ గాయుం ఎక్కడ చీమ్ పడుతుందో అన్న భయుంతో పప్పులను తినవద్దని చెబుతుంటారు.
 
 నిజానికి చీమ్ పట్టడం అన్న ప్రక్రియు బ్యాక్టీరియుల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే ఇన్‌ఫ్లమేషన్ వల్ల జరుగుతుంది. అంతేగాని పప్పు ధాన్యాల వల్ల కాదు. పైగా భారతీయల్లో శాకాహారం తినడమే ఎక్కువ. ఎందుకంటే వూంసాహారం తినేవాళ్లు కూడా ఎక్కువసార్లు తినేది శాకాహారమే. దాంతో వునకు అవసరమైన ప్రొటీన్లను అందించడంలో ప్రధానమైన భూమిక పప్పుధాన్యాలే పోషిస్తాయి. అందుకే ఏదైనా గాయుం తగిలి వూనుబట్టే దశలో ఉన్నప్పుడూ, సర్జరీ వంటివి జరిగినప్పుడూ వేగంగా కోలుకోవడానికి, ఏదైనా గాయం అయితే దాన్ని మానేలా చేసుకోడానికి పప్పులను తప్పకుండా తినాలి. అంతే తప్ప, పప్పులు తింటే చీము పడుతుందనే భయంతో వాటికి దూరంగా ఉండటంలో అర్థం లేదు.
 

>
మరిన్ని వార్తలు