ఆవిష్కరణం: టార్చ్‌లైట్ పూర్వరూపం లాంతరే!

7 Dec, 2013 23:21 IST|Sakshi
ఆవిష్కరణం: టార్చ్‌లైట్ పూర్వరూపం లాంతరే!

నిప్పును నిరంతరం వెలిగే దీపంగా మార్చుకొని, దాన్ని ఒక కాంతిజనకంగా ఉపయోగించుకోవడం క్రీస్తు పూర్వం వేల ఏళ్ల క్రితమే మొదలైందని పరిశీలకుల భావన. గ్రీకు భాషలో వీటినే ‘లంపాస్’ అనే వారు. అవే ఇంగ్లిష్‌లో ‘ల్యాంప్’లు అయ్యాయి. క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దంలో ఈ పదం వాడకంలోకి వచ్చింది. ఆ తొలినాళ్ల దీపాలే ‘టార్చ్‌లైట్లు’. అలాగే లాంతర్లను కూడా టార్చ్‌లుగానే భావించవచ్చు. నేటికీ వినియోగంలో ఉన్న లాంతర్లు 1783లో తొలిసారి ఆవిష్కృతం అయ్యాయి. అమీ ఆర్గండ్ అనే స్విస్ట్ కెమిస్ట్ వీటిని రూపొందించాడు. ఇవే చీకటిని చేధించి ముందుకు వెళ్లడానికి ఉపయోగపడే నమ్మకమైన హ్యాండ్ ల్యాంప్స్‌గా మారాయి. తొలిరోజుల్లో జంతువుల కొవ్వుతో ఈ దీపాలను వెలిగించి, చీకటిలో ఉపయోగించే వారు. తర్వాత వంద సంవత్సరాలకు గ్యాస్, కిరోసిన్ ఇంధనంగా ఉండే లాంత ర్లను తయారు చేశారు.
 
 ఇవి ఆధునికంగా రూపాంతరం చెంది డ్రై సెల్ బ్యాటరీగా 1896లో అందుబాటులోకి వచ్చింది. అదే మనం వాడే ‘టార్చ్’. లిక్విడ్ రూపంలోని ఇంధనానికి భిన్నంగా పేస్ట్ ఎలక్ట్రోలైట్‌ల ద్వారా ఒక లైట్‌ను వెలిగించాలనే ఐడియా హ్యాండ్ బ్యాటరీ రూపకల్పనకు దారి తీసింది. తొలిసారి ఈ హ్యాండ్‌ల్యాంప్స్‌ను న్యూయార్క్ సిటీ పోలీసులు ఉపయోగించారు. రాత్రిపూట గస్తీ కోసం పరిశోధకులు వీటిని పోలీసులకు డొనేట్ చేశారు. ఆ విధంగా టార్చ్‌లైట్లు విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. ఆ తర్వాత లైట్ల విషయంలోనూ, ముందువైపు ఉండే అద్దం విషయంలో అనే మార్పులు వచ్చాయి. తర్వాత ఎల్‌ఈడీలు, హెచ్‌ఐడీల రూపంలోని లైట్లతో బ్యాటరీలను రూపొందించారు. విద్యుత్‌ఘటాలతో, చార్జింగ్‌తో, కరెంట్‌తో పనిచేసే రకరకాల టార్చ్‌లైట్లూ వినియోగంలోకి వచ్చాయి.

మరిన్ని వార్తలు