రంగురంగుల రాళ్ల గాజులు!

1 May, 2016 04:23 IST|Sakshi
రంగురంగుల రాళ్ల గాజులు!

ఒకే రంగులో ఉన్న గాజులు వేసుకోవడం ఓల్డ్ ఫ్యాషన్. రంగు రంగుల రాళ్లు (క్రిస్టల్స్) ఉండే బ్యాంగిల్స్ నయా ఫ్యాషన్! వాటిని మనకు మనమే తయారు చేయడం నేర్చుకుందామా!
 
కావలసినవి: గోల్డ్ కలర్ తీగ (మందంగా ఉండాలి), గాజు గ్లాసు (మీ బ్యాంగిల్ సైజుకు తగ్గట్టుగా), వివిధ రంగుల క్రిస్టల్స్ లేదా బీడ్స్, వైర్ కట్టర్, పట్టకారు
 
తయారీ విధానం:
ముందుగా వైరును గాజు గ్లాసుకు గుండ్రంగా చుట్టాలి. ఎన్ని చుట్లు కావాలన్నది మీ ఇష్టం. వాటి చివర్లను పట్టకారు సాయంతో గట్టిగా తిప్పాలి. జాగ్రత్తగా ముడివేసి పక్కన పెట్టుకోవాలి. మిగతా వైరును కట్టర్ సాయంతో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక వైరు ముక్కతో బీడ్‌ని కానీ క్రిస్టల్‌ను కానీ తీసుకొని, ముందుగా చుట్టి పక్కన పెట్టుకున్న తీగకు ఫొటోలో చూపించిన విధంగా అమర్చాలి. వాటి చివర్లను కూడా పట్టకారు సాయంతో ముడి వేయాలి. అలాగే మరో క్రిస్టల్‌నూ యాడ్ చేసుకోవాలి. అలా ఒక్క గాజుకు రెండు, మూడు క్రిస్టల్స్‌ను పెట్టుకోవచ్చు. కావాలంటే ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు. కాంబినేషన్‌‌స జాగ్రత్తగా ఎంచుకుంటే చాలు. ఇవి బ్యాంగిల్స్‌లానే కాదు, బ్రేస్‌లెట్స్‌లా కూడా అనిపిస్తాయి!

మరిన్ని వార్తలు