వారఫలాలు

17 Mar, 2019 01:13 IST|Sakshi

17 మార్చి నుంచి 23 మార్చి 2019 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది.  మీ వ్యూహాలు, ప్రణాళికలపై కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమ. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని పనులలో ఆటంకాలు ఎదురుకావచ్చు. అయితే పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆత్మబలం, ధైర్యమే ఈవారం మీకు ఆయుధాలు. మిమ్మల్ని బలహీనపర్చడానికి ప్రత్యర్థులు చేసే యత్నాలు ఫలించవు. ఆర్థిక విషయాలు కొంత మెరుగ్గా ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు.   ప్రముఖులను కలిసేందుకు యత్నిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో ఎదురుచూడని మార్పులు సంభవం. కళారంగం వారికి ప్రోత్సాహం అంతగా కనిపించదు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.  ఒక సమాచారంతో నిరుద్యోగులు ఊరట చెందుతారు. మీ నిర్ణయాలు అందరూ శిరసావహిస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు కొన్ని తీరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. గతంలో పొరపాట్లు సరిదిద్దుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొన్ని సంఘటనలు బాగా ఆకట్టుకుంటాయి. సోదరులు, మిత్రుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. నేర్పు, ఓర్పుతో జఠిలమైన సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సమస్యలు కొన్ని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. బంధువుల నుంచి ధనప్రాప్తి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యాపార లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు విజయవంతం కాగలవు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
అనుకున్న పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో నెలకొన్న సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులతో  ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. నమ్మిన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగుతారు. ఎవరు అడ్డగించినా లెక్కచేయరు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి.

 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.  చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు. విద్యార్థులకు శుభవార్తలు. నూతన వ్యక్తుల పరిచయం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం.  ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా ముగిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. బంధువులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. గతాన్ని విస్మరించి భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. వాహనయోగం కలుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. బంధువిరోధాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ నిర్ణయాలను అందరూ మెచ్చుకుంటారు. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది, విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో (17 మార్చి నుంచి  23 మార్చి, 2019 వరకు)

మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
అవరోధాలను అధిగమించి మరీ లక్ష్యాలను సాధిస్తారు. గొప్ప గొప్ప విజయాల దిశగా విధి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సానుకూల దృక్పథం రెట్టింపవుతుంది. ఉత్సాహంగా కొత్త కొత్త పనులు చేపట్టడానికి ఉవ్విళ్లూరుతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో సంప్రదిస్తారు. అనూహ్యంగా వచ్చే ప్రేమ ప్రతిపాదనల పట్ల ఆచి తూచి వ్యవహరించడం మంచిది. మభ్యపెట్టే మాటల మాయాజాలంలో పడకుండా అప్రమత్తంగా మెలగండి. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
నాటకీయమైన మార్పులు సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యాపార భాగస్వామ్య సంబంధాలు గొప్ప అవకాశాలకు దోహదపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలు చేతికందుతాయి. పగటి కలలు మానేసి ఆలోచనల్లో స్పష్టతను పెంచుకుంటే మరిన్ని విజయాలను సాధించగలుగుతారు. ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. శుభ కార్యాలను నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. ఆలయాలను సందర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పుల పట్ల తొలుత అనుమానాలు రేకెత్తినా, చివరకు అవి మీకు మేలు చేసేవిగానే పరిణమిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. స్వల్పకాలిక పెట్టుబడుల ద్వారా ఊహించని లాభాలను అందుకుంటారు. ఇంటికి కొత్త అలంకరణలు చేపడతారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. 
లక్కీ కలర్‌: గోధుమ రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అకాల భోజనం తప్పకపోవచ్చు. కుటుంబ బాధ్యతల భారం మోయాల్సి వస్తుంది. మానసిక స్థైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారంలో ఉన్నవారితో పేచీలు తప్పకపోవచ్చు. నైతిక స్థైర్యంతో ముందుకు సాగుతారు. అనూహ్యమైన, అసాధారణమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో పెద్దల నుంచి అవరోధాలు ఎదురవుతాయి.
లక్కీ కలర్‌: లేత నీలం

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఉత్సాహంతో ఉరకలేస్తారు. జనాకర్షణ పెరుగుతుంది. మిమ్మల్ని మీరు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడంపై శ్రద్ధ చూపుతారు. కొత్త దుస్తులు, అలంకరణ సామగ్రి కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. వ్యాయామంపై శ్రద్ధ పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారావకాశాలను మెరుగుపరచుకుంటారు. స్వల్పకాలిక పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. నిర్వహణ తలకు మించిన భారంగా మారిన స్థిరాస్తులను విక్రయిస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు.
లక్కీ కలర్‌: ఊదా

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. అనవసరంగా ఇబ్బంది పెట్టేవారు ఎదురవుతారు. స్థైర్యాన్ని కోల్పోకుండా, మీదైన స్థిర వైఖరితో ముందుకు సాగండి. లేనిపోని వదంతులు మనస్తాపం కలిగిస్తాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. ఒత్తిడిని జయించడానికి యోగ, ధ్యానం వంటి వాటిపై దృష్టి పెడతారు. ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. బాకీలు వసూలవడంలో జాప్యం తలెత్తవచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. స్నేహితుల నుంచి సకాలంలో సాయం అందుతుంది.
లక్కీ కలర్‌: వెండి రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ప్రస్తుత పరిస్థితులను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను లౌక్యంతో అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాల వల్ల చిక్కుల్లో పడే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. త్వరిత గతిన పనులు పూర్తి కావాలనుకుంటారు. దురుసుతనంతో ఇతరులను నొప్పిస్తారు. మిత్రులను ఆదుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. 
లక్కీ కలర్‌: నేరేడు రంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
అవరోధాలు తొలగిపోతాయి. చిరకాలంగా ఇబ్బంది పెడుతున్న గడ్డు సమస్య నుంచి బయట పడతారు. భావోద్వేగాలను వెల్లడిస్తారు. కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పిల్లల విజయాలు సంతోషాన్ని ఇస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా సంస్థలకు విరాళాలు ఇస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. బాగా పరిచయం ఉన్న వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదన మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. 
లక్కీ కలర్‌: ముదురు పసుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ఉక్కిరిబిక్కిరిగా ఉంటాయి. అకాల భోజనం తప్పకోవచ్చు. అలసట చెందుతారు. శక్తులన్నీ కోల్పోయినట్లుగా భావిస్తారు. మానసికంగా అలజడికి లోనవుతారు. ఏకాంతాన్నీ ప్రశాంతతనూ కోరుకుంటారు. ధ్యానమార్గంలో సాంత్వన పొందుతారు. కొత్త ఉద్యోగావకాశాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా, ఆశించిన అభివృద్ధి ఇంకా సాధించలేదనే అసంతృప్తి వెంటాడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంటుంది. విహార యాత్రలతో కొంత ఉత్తేజం పొందుతారు.
లక్కీ కలర్‌: లేత నారింజ

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అతిగా తాపత్రయపడతారు. భావి ప్రణాళికలతో నిరంతరం సతమతమవుతూ వర్తమానంలో తారసపడే ఆనందాలను కోల్పోతారు. వృత్తి ఉద్యోగాల్లో అవసరానికి మించి శ్రమిస్తారు. అనుకోని అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పనిని ఇతరులతో పంచుకుంటేనే మీకు తీరిక చిక్కుతుంది. అన్ని పనులూ స్వయంగా చేయాలనే చాదస్తాన్ని వదులుకుంటేనే జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒంటరిగా ఉంటున్నవారు తగిన జంట కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది.
లక్కీ కలర్‌: బంగారు రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. ఇదివరకటి పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. ప్రేమానుబంధాన్ని ఆస్వాదిస్తారు. ప్రియతములతో విహారయాత్రలకు వెళతారు. ఇంట్లోను, కార్యాలయంలోను మొక్కలు నాటడం ద్వారా ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. జనాకర్షణ పెరుగుతుంది. సన్నిహితులు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. ప్రముఖు సహాయంతో గడ్డు సమస్యల నుంచి తేలికగా బయటపడతారు.
లక్కీ కలర్‌: ముదురు నారింజ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరి వారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత వహించాల్సి వస్తుంది. చేటు చేసే పాత అలవాట్లను మానుకుని కొత్తగా మంచి అలవాట్లను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కళాకారులకు ఉన్నత సత్కారాలు లభిస్తాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు కూడా ఉంటాయి. గురువుల ఆశీస్సులు పొందుతారు.
లక్కీ కలర్‌: బూడిద రంగు
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

Read latest Funday News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మెరిసేందుకు మెరుగులు

అందాల సోయగం

చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?

వెరైటీ వంటకాలు.. కమ్మనైన రుచులు

పండితుడి గర్వభంగం

టారో-వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

వారఫలాలు (జూలై 14 నుంచి 20 వరకు)

ఫస్ట్‌ టైమ్‌ రాబరీ..!

నాకు ఆ సమస్య ఉంది

వాసన లేని పువ్వు

ఓహో! అదా విషయం!

సన్యాసికి లోకమంతా ఇల్లే

రావిచెట్టుకు రక్తం కారుతోంది..!

కీచైన్‌ ఉద్యమం

తెల్లదొరలను వణికించిన తెలుగు పాట

కుక్క కాటుకు పప్పు దెబ్బ..!

వచ్చిన వాడు ఫల్గుణుడే...

4జి ఉంటేనే సినిమా ఒప్పుకుంటా: ఇషా

ఇంటింటా చాక్లెట్‌..

సాయంత్రం సరదాగా స్నాక్స్‌తో..

టారో-వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

వారఫలాలు (జూలై 7 నుంచి 13 వరకు)

శంకర విజయం-4

బంగారు కల

స్థితప్రజ్ఞారాముడు

జనాభాలో మనమే నంబర్‌ వన్‌!

ఆత్మహత్య కానే కాదు...

దాని గురించి నాకు ఏమీ తెలియదు

ద్రౌపది..

ఐదు పైసలు వరదక్షిణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’