సవాళ్లను దాటి.. జనహృదిని మీటి

12 Mar, 2020 00:52 IST|Sakshi

పదవ వసంతంలోకి అడుగిడిన వైఎస్సార్‌సీపీ

ఒక మనిషిని అణగదొక్కడానికి ఎన్నో రకాల కుట్రలు. ఒక పార్టీ ఎదగకుండా ఎన్నో వైపుల నుంచి దాడులు. అయినా జగన్‌ నడిచాడు, జనాన్ని గెలిచాడు. పార్టీ బరిలో నిలిచింది, ప్రభంజనం సృష్టించింది. సవాళ్లనే సోపానాలుగా మలుచుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదేళ్ల ప్రస్థానం ఇది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తొమ్మిదేళ్ల ప్రయాణం ఇది.

సంక్షేమ పథకాల ప్రదాతగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసత్వాన్ని కొనసాగించడానికి ముందడుగు వేసిన జగన్‌మోహన్‌ రెడ్డి, పూర్తి ప్రతికూల పరిస్థితు ల్లోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ను తొమ్మిదేళ్లలో తిరుగు లేని రాజకీయ శక్తిగా తీర్చి దిద్దారు. చరిత్రలో ఎందరో ముఖ్యమంత్రులు, వారి కుమారులు ఉన్నా వారెవరూ సోదిలో కూడా లేకుండా పోయారు. కానీ జగన్‌ చరిత్రను సృష్టించారు. దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో మరెక్కడా కూడా మరణించిన ఒక రాష్ట్రాధినేత, దేశాధినేత కుమా రులు అణచివేతను ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో కృతకృత్యులైన వారు లేరు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికా రంలోకి రావడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదేళ్ల కృషి ఉంది. మార్చి 12, 2011న తన తండ్రి సమాధి వద్ద ఆయన పేరు ప్రతి బింబిం చేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌) పార్టీని జగన్‌ స్థాపించారు. 2009 లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో కడప లోక్‌సభా స్థానం నుంచి ఎంపీగా ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేసిన జగన్‌ సొంతంగా పార్టీని పెట్టడానికి గల నేపథ్యం ప్రజ లందరికీ తెలుసు. తన రెక్కల కష్టంతో నిరంకుశ టీడీపీ 9 ఏళ్ల పాలనను మట్టి కరిపించి 2004 ఎన్ని కల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కాగలిగారు. అందరూ మెచ్చే పథకాలను తన ఐదేళ్ల పాలనలో అమలు చేసి తిరిగి 2009లో రెండోసారి సీఎం అయ్యారు. కొద్ది నెలలైనా గడవక ముందే రచ్చ బండ కార్యక్రమానికి వెళుతూ సెప్టెంబర్‌ 2, 2009 నాడు హెలీకాప్టర్‌ ప్రమాదంలో మరణించి యావత్‌ తెలుగు ప్రజలను విషాదంలో ముంచెత్తారు. 

ఇచ్చిన మాట కోసం
తండ్రి హఠాన్మరణపు షాక్‌లో ఉండగానే ఈ విషాదాన్ని తట్టుకోలేక వందలాది మంది మరణించడం జగన్‌నూ, ఆయన కుటుంబీకులనూ కలచి వేసింది. వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళతానని నల్ల కాలువ వద్ద (వైఎస్‌ మరణించిన చోటు) జరిగిన సభలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పు యాత్రను ప్రారంభించిన జగన్‌ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. యాత్రను ఆపేయాల్సిందిగా కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశించింది. ఓదార్పు యాత్రకూ రాజకీయాలకూ సంబంధం లేదనీ, మృతి చెందిన కుటుంబాలకు ధైర్యం చెప్పడానికే వెళుతున్నాననీ జగన్‌ తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలతో ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలిసి వివరించినా లాభం లేకపోయింది. ఏదైతే అదవుతుందని ఓదార్పు యాత్రను తాను అనుకున్న విధంగా జగన్‌ కొనసాగించారు. దానికి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక పోయిన కాంగ్రెస్‌లోని కొన్ని శక్తులు, టీడీపీతో కలిసి కుట్ర లకు తెరతీశాయి. జాతీయ కాంగ్రెస్‌ నేతల వైఖరిని అర్థం చేసుకున్న జగన్‌ తన తల్లి విజయమ్మతో కలిసి కడప లోక్‌సభ, పులివెందుల శాసనసభ స్థానాలకు రాజీనామాలు చేయడంతో పాటుగా కాంగ్రెస్‌ పార్టీకి 29 నవంబర్‌ 2010న రాజీ నామా చేశారు.

పోరుబాటలో...
పార్టీని వీడాక ఓ వైపు ఓదార్పు యాత్రను సాగి స్తూనే, మరో వైపు ప్రజా సమస్యలపై పోరాటం చేశారు జగన్‌. వైఎస్‌ స్థానంలో వచ్చిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాల అమలును నిర్లక్ష్యం చేయడాన్ని ప్రశ్నిస్తూ పలు దీక్షలు చేశారు. రైతులు, చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతూ విజయవాడ కృష్ణా నదీ తీరాన 21 డిసెంబర్‌ 2010న ‘లక్ష్య దీక్ష’తో పోరుబాటను ప్రారంభించారు. పార్టీని వీడిన తరువాత జగతి పబ్లికేషన్స్‌కు ఆదాయపు పన్నుల శాఖ నోటీసులను జారీ చేయడంతో వేధిం పుల పర్వం ప్రారంభం అయింది. లెక్క చేయని జగన్‌ 11 మార్చి 2011న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజునే ఇడుపు లపాయలో పతాకాన్ని తండ్రి సమాధి వద్ద ఆవిష్క రించి పార్టీని స్థాపించారు. రైతులు, చేనేత, విద్యార్థి, యువజన, నిరుద్యోగ వర్గాల సమస్యలపైనా, రాష్ట్రానికి రావాల్సిన హక్కులపైనా నిత్య పోరా టాలు చేస్తూ పార్టీని పటిష్టం చేసుకుంటూ వచ్చారు.

16 నెలల అక్రమ నిర్బంధం
వైఎస్సార్‌సీపీ బలీయమైన శక్తిగా ఎదుగుతోందని గ్రహించిన కాంగ్రెస్‌ అధిష్టానవర్గం జగన్‌ అణ చివేతకు పిడికిలి బిగించింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్రావు కేసు వేయడం, టీడీపీ నేతలు కూడా కేసులో ప్రతివాదులుగా చేరడంతో హైకోర్టు జగన్‌పై సీబీఐ విచారణకు ఆదేశించింది. ఉప ఎన్నికల ప్రచా రంలో ఉన్న జగన్‌ను దర్యాప్తు కోసమని పిలిచి మే 27, 2012న అరెస్టు చేసి 16 నెలల పాటు జైలులో పెట్టింది. జైలులో ఉంచడం వల్ల ఆయన పలుకుబడి మరింత పెరిగిందే తప్ప మసక బారలేదు. చంచల్‌ గూడ జైలులో ఉన్నప్పటికీ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, సోదరి షర్మిల సహకారంతో పార్టీని పటిష్టం చేసే వ్యూహాలను రూపొందిం చారు. 24 సెప్టెంబర్‌ 2013న జైలునుంచి విడుద లైన కొద్ది రోజుల్లోనే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆమరణ దీక్షకు పూనుకుని 2014 శాసనసభ ఎన్ని కలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. 

ప్రతిపక్ష నేతగా జగన్‌
2014 ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగలదని చివరివరకూ అంచనాలు వెలువడి నప్పటికీ అనూహ్యమైన రీతిలో కొద్ది తేడాతో పరా జయం పాలైంది. 67 శాసనసభా స్థానాలను గెల్చు కుని ఏకైక అతి పెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరిం చింది. అధికార పక్షమైన టీడీపీ అనైతికమైన రాజ కీయ కుట్రలతో వైఎస్సార్‌సీపీని నలిపి వేయాలని చూసింది. 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చు కుని వారిని అనర్హతకు గురి కాకుండా స్పీకర్‌ వ్యవ స్థను ఉపయోగించుకుంది. తమ పార్టీ నుంచి ఫిరా యించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించా లని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తూ 11 నవం బర్‌ 2017 నుంచీ శాసనసభను బహిష్కరించారు. 

చారిత్రాత్మకం–ప్రజా సంకల్పం
6 నవంబర్‌ 2017న తన తండ్రి సమాధి వద్ద నుంచి ప్రారంభించి, 14 నెలలు 3,648 కిలోమీటర్ల మేరకు చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్ర రాజకీ యాల్లో చరిత్ర సృష్టించింది. ఇచ్ఛాపురంలో 9 జన వరి 2019న ముగించిన ఈ యాత్రలో జగన్‌ లక్ష లాది మంది కష్ట సుఖాలు తెలుసుకున్నారు. యాత్ర ముగిసీ ముగియగానే వేడెక్కిన 2019 ఎన్నికల వాతావరణంలో పార్టీని దీటుగా నడిపించారు. తిరు గేలేదని భావించిన బాబు నిరంకుశ ప్రభుత్వాన్ని మట్టి కరిపించారు. కనీ వినీ ఎరుగని రీతిలో 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151, 25 లోక్‌సభ స్థానా లకుగాను 22 గెల్చుకుని అధికారాన్ని కైవసం చేసుకున్నారు. 

తండ్రి కన్నా ముందడుగే...
పేదలను ఆదుకునే విషయంలో తండ్రి కన్నా రెండ డుగులు ముందే ఉంటానని తొలి నుంచీ ప్రకటిస్తూ వచ్చిన జగన్, 2019 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే తొలి సంతకం ద్వారా అవ్వా తాతల పింఛన్లను రూ.2,250కి పెంచి, తండ్రి తొలి సంతకపు వారసత్వాన్ని కొనసాగించారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోయే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ అని పేర్కొన్న జగన్‌ అక్షరాలా అందులోని హామీల అమలుకు తొలి రోజు నుంచే పూనుకున్నారు. బల హీన వర్గాలకు పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పించడమే కాక మంత్రి వర్గంలో సైతం సగానికి పైగా పదవులను ఇచ్చి నూతన సంప్రదాయాన్ని నెలకొల్పారు. అమ్మ ఒడి మొదలు నాడు నేడు, రైతు భరోసా... ఇలా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను విప్లవాత్మకమైన రీతిలో అమలు చేస్తున్నారు.ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనుకడుగు వేయ కుండా హామీలను అమలుచేసే యజ్ఞంలో మునిగి పోయారు. తన పదేళ్ల కృషితో, 9 ఏళ్ల వైఎస్సార్‌సీపీ రాజకీయ ప్రస్థానంలో జగన్‌ తన తండ్రిలాగే ప్రతి పేదవాడి గుండెల్లో కొలువు దీరాలని అప్రతిహ తంగా ముందుకు సాగుతున్నారు. 

-ఆర్‌.ఎం. బాషా, సీనియర్‌ చీఫ్‌ రిపోర్టర్, సాక్షి

మరిన్ని వార్తలు