బాల కార్మికులు లేని సమాజం కోసం..

12 Jun, 2018 01:16 IST|Sakshi

‘ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐ.ఎల్‌.ఓ.) జూన్‌ 12న ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినంగా జరపాలని తీర్మానించింది. పిల్లలను దొంగ తనంగా రవాణా చెయ్యడాన్ని ఆపడం, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం బాలకార్మికులు బడిబాట పట్టేలా చూడటం ఈ దినోత్సవ లక్ష్యం. 2002 నుంచి ప్రతియేటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అభి వృద్ధి చెందిన దేశాలలో కూడా బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా 27.6 కోట్ల మంది పిల్లలు బాలకార్మికులుగా ఉన్నారని సర్వేలు, గణాంకాలతో సహా వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు అనాధలు కావడం, కుటుంబ పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణాలవల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారు. కర్మాగారాలలో, హోటల్స్‌లో, రైల్వే, బస్సు స్టేషన్‌లు, వీధులలో బాల కార్మికులు కని పిస్తున్నారు. చాలీ చాలని జీతాలతో పనులు చేస్తూ బతుకు బండిని లాగుతున్నారు. బాల కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడు తున్నా ఫలితాలు శూన్యం.

సరైన సమయానికి తిండి దొరకక పస్తులు ఉంటూ రోగాలపాలవుతున్నారు బాల కార్మికులు. వీధులలో తిరుగుతూ పడేసిన వాటర్‌ బాటిళ్లు, చిత్తు కాగితాలు, కవర్లు ఏరుకుంటూ జీవితం గడుపుతు న్నారు. గ్రామాలలో బడి ఈడు గల పిల్లలు బడికి వెళ్లకుండా పశువులను మేపడానికి వెళ్లడం, లారీలు, ట్రాక్టర్లు, ప్రైవేటు బస్సులలో క్లీనర్‌లుగా పనిచేస్తూ బాల కార్మికుల సంఖ్య పెరగడానికి కారణాలుగా నిలుస్తున్నారు. చట్టాలను అమలు చేస్తున్న నాయ కుల ఇళ్లలో బాల కార్మికులు పనిచేస్తున్నట్లు పత్రిక లలో కథనాలు కూడా గతంలో వచ్చాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, వివిధ దేశాలలో బాల కార్మి కుల సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. సమా జంలో భాగస్వాములైన మనమందరం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు నడుం బిగిద్దాం. బాల కార్మి కులతో మాట్లాడి పాఠశాలల్లో చేర్పిద్దాం. అనాథ లైన బాల కార్మికులను ప్రభుత్వ వసతి గృహాలలో ఉండేలా ప్రవేశం కల్పిద్దాం. దేశ అభివృద్ధికి అవరో ధంగా నిలుస్తున్న బాలకార్మిక వ్యవస్థను తరిమి కొట్ట డానికి ప్రతి ఒక్కరం ముందుకు వద్దాం.

(నేడు ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినం)
కామిడి సతీష్‌ రెడ్డి, జెడలపేట, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ‘ మొబైల్‌ : 98484 45134 

మరిన్ని వార్తలు