నీటిలో చిక్కుకున్న 200 మంది కార్మికులు

17 Nov, 2015 12:53 IST|Sakshi

నాయుడు పేట: నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు గేటు సమీపంలో ఎంజే స్టీల్ ఫ్యాక్టరీ నీట మునిగింది. దీంతో 200 మంది కార్మికులు నీటిలో చిక్కుకు పోయారు. సోమవారం రాత్రి కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో మామిడి కాల్వ పొంగి పొర్లడంతో ఆ నీరు పరిశ్రమను చుట్టుముట్టింది. నీటిమట్టం అంతకంతకూ పెరుగుతూ సుమారు ఐదారు అడుగుల మేర చేరింది.

దీంతో కార్మికులు గోడలపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. బయటపడే మార్గం లేకపోవడంతో వారు అక్కడే ఉండిపోయారు. మంగళవారం మధ్యాహ్నానికి రెవెన్యూ, పోలీసు అధికారులు రంగంలోకి దిగి వారిని కాపాడేందుకు  చర్యలు చేపట్టారు. వీరంతా బిహార్ యూపీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన కూలీలని సమాచారం.1992లో ఇదే ప్రాంతంలో మామిడి కాల్వ పొంగి పొర్లడంతో వరద ప్రవాహంలో చిక్కుకుని నలుగురు మరణించారు.
 

మరిన్ని వార్తలు