విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి

23 Aug, 2015 19:06 IST|Sakshi

రంగారెడ్డి : తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ నినాదాన్ని గతంలో వినిపించి ప్రభుత్వంపై ఉద్యమించిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నోరు మెదపకపోవడాన్ని తప్పుబట్టింది. అమరుల త్యాగాల ఫలితంగా నిజాం నిరంకుశపాలన నుంచి తెలంగాణకు విమోచనం కలిగిందని, దీంతో సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరింది.

మైనార్టీ ఓట్ల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ అమరుల త్యాగాలనే తాకట్టు పెడుతోందని విమర్శించింది. ఈమేరకు ఆదివారం బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కొప్పు బాష ఒక ప్రకటన విడుదల చేశారు. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 26న అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు చేపట్టాలని, ప్రజలకు విమోచన దిన ఆవశ్యకతను వివరించాలని ఆయన సూచించారు.

>
మరిన్ని వార్తలు