పుల్లూర్‌లో కొనసాగుతున్న తవ్వకాలు

23 Jul, 2015 00:20 IST|Sakshi
పుల్లూర్‌లో కొనసాగుతున్న తవ్వకాలు

వేటాడే పరికరం లభ్యం
సిద్దిపేట రూరల్: మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని పుల్లూర్ గ్రామ శివారులో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలు కొనసాగుతున్నాయి. బుధవారం పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తవ్వకాలను పరిశీలించారు. బృహత్‌శిలా యుగపు సమాధుల తవ్వకాల్లో భాగంగా జంతువులను వేటాడే పరికరం (ఈటె) కనిపించింది. ఇది ప్రస్తుతం 61 సెంటీమీటర్ల మేర బయటకు కనిపిస్తోంది. అది సుమారుగా మీటరు లోతున ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

అలాగే భోజనం చేసే బౌల్స్, ఉలి (చీజిల్), మృణ్మయ పాత్రలు, ఇతర ఇనుప పనిముట్లు లభ్యమవుతున్నాయి. పనులను ఎప్పటికప్పుడు పురావస్తు శాఖ సాంకేతిక సహాయకులు టి. ప్రేమ్‌కుమార్, రిటైర్డు ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తి పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు