మహిళపై అత్యాచారం, ఆపై హత్యాయత్నం..

12 Jan, 2016 16:27 IST|Sakshi

జోగిపేట (మెదక్): మహిళను మద్యం తాగించి అత్యాచారం, ఆపై హత్య చేసేందుకు యత్నించిన నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మెదక్ డీఎస్‌పీ రాజారత్నం మంగళవారం జోగిపేట పోలీస్‌సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 4వ తేదీన టేక్మాల్ మండలం తంపులూరు గ్రామానికి చెందిన మహిళ తన బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి పెద్ద శంకరంపేట మండలం ఉత్తులూరు వెళ్లింది. ఈ నెల 5వ తేదీన అక్కడే ఆమెకు బంధువైన ఎడ్ల యాకోబ్ అలియాస్ పెంటయ్య కలిశాడు. ఆమెను నిర్మానుష్యం ప్రాంతానికి తీసుకువెళ్లి మద్యం తాగించి అత్యాచారం చేశాడు.

అనంతరం ఆమెను తీవ్రంగా హింసించటంతో స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమె కాళ్లకు ఉన్న వెండి కడియాలను తీసుకుని పరారయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు తన బంధువు సాయంతో పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది. ఈ కేసులో పోలీసులు విచారణ జరిపి నిందితుడు యాకోబ్‌ను ఉత్తులూరులో మంగళవారం అదుపులోకి తీసుకొని జోగిపేట మున్సిఫ్‌ కోర్టుకు రిమాండ్ చేశారు. నిందితుడిపై రౌడీషీట్‌ను తెరుస్తున్నట్లు డీఎస్పీ రాజారత్నం వివరించారు.

Read latest Home-latest-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా