మైనర్‌పై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్‌

10 Mar, 2017 12:30 IST|Sakshi
హైదరాబాద్‌: నగర శివారులో దారుణం జరిగింది. మాయమాటలు చెప్పి మైనర్‌ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన సంఘటన నగరంలోని ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. మన్సురాబాద్‌లోని ఆదిత్య నగర్‌కు చెందిన రాకేష్‌ రెడ్డి(19) ఇంటి పక్కనే ఉంటున్న ఓ మైనర్‌ బాలికతో చనువుగా ఉండేవాడు.
 
ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.
మరిన్ని వార్తలు