రాజ్యంకోసం మహిళ పోరాటం

18 Sep, 2023 05:07 IST|Sakshi
మోనిక, దేవీప్రసాద్‌

మోనికా రెడ్డి ప్రధాన పాత్రలో రాకేష్‌ రెడ్డి యాస దర్శకత్వంలో ఓ సినిమా షురూ అయింది. సుధ క్రియేషన్స్‌పై రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి అంజిరెడ్డి కెమెరా స్విచ్చాన్  చేయగా, షేడ్స్‌ స్టూడియో ఫౌండర్‌ దేవీ ప్రసాద్‌ బలివాడ క్లాప్‌ ఇచ్చారు.

మోనికా రెడ్డి మాట్లాడుతూ– ‘‘పీరియాడిక్‌ మైథలాజికల్‌గా రూపొందనున్న చిత్రమిది. కథ అంతా నా పాత్ర చుట్టూ తిరుగుతుంది’’ అన్నారు. ‘‘రాజ్యం కోసం ఓ మహిళ ధైర్యసాహసాలతో ఎలా పోరాడింది? అన్నదే ఈ చిత్రం కథాంశం’’ అన్నారు రాకేష్‌ రెడ్డి యాస. ‘‘నయనతార, అనుష్కగార్లలా మోనికకు మంచి పేరు రావాలి’’ అన్నారు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ భాస్కర్‌ రెడ్డి.
 

మరిన్ని వార్తలు