ఎన్ఐఏ కస్టడీకి ఐసిస్ సానుభూతిపరులు

1 Jul, 2016 16:39 IST|Sakshi

హైదరాబాద్ :  హైదరాబాద్‌లో మారణహోమం సృష్టించేందుకు కుట్రపన్నిన ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) అనుబంధ సంస్థ అన్సార్ ఉల్ తవ్హిద్ ఫి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)కు చెందిన అయిదుగురు ఐసిస్ సానుభూతిపరులను తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏ అధికారుల కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రెండురోజుల క్రితం అరెస్ట్ చేసిన మహ్మద్ ఇబ్రహీం అలియాస్ ఇబ్బు, హబీబ్ మహ్మద్ అలియాస్ సిర్, మహ్మద్ ఇలియాస్, అబ్దుల్ బిన్ అహ్మద్ అమౌదీ అలియాస్ ఫహద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్లను ఎన్‌ఐఏ అధికారులు ఈ నెల 12వ తేదీ వరకు విచారించనున్నారు. కాగా 30 రోజుల పాటు కస్టడీకి అనుమతి కోరుతూ ఎన్ఐఏ అధికారులు నిన్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కేవలం పన్నెండు రోజులపాటు అనుమతిచ్చింది.

>
మరిన్ని వార్తలు