పుట్టినరోజు వేడుకల్లో విషాదం

20 May, 2017 12:46 IST|Sakshi

హైదరాబాద్‌: తన పుట్టిన రోజు వేడుకల‍్లో మద్యం తాగిన యువకుడు ఇంటి పైనుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన నగరంలోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో శనివారం చోటు చేసుకుంది. సైదాబాద్‌ సింగరేణికాలనీలో గౌతమ్‌ అనే యువకుడు స్నేహితులతో పెంట్‌హౌస్‌లో పుట్టునరోజు వేడుకలు చేసుకున‍్నాడు. ఈ సందర‍్భంగా స్నేహితులతో కలిసి గౌతమ్‌ మద్యం సేవించాడు.

మద్యం మత్తులో ఉన‍్న గౌతమ్‌ ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు పై నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సైదాబాద్‌ పోలీసులు ఘటనా స్థలాలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు