అగ్నిప్రమాదంలో వంద గుడిసెలు దగ‍్ధం

20 May, 2017 12:56 IST|Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి జిల్లా యాదగిరిగుట‍్ట పట‍్టణంలో శనివారం మధ్యాహ‍్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వంద గుడిసెలకు పైగా కాలి బూడిదయ్యాయి. యాదగిరిగుట్టలో సాయిపవన్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ అభివృద్ధి పనులు చేపట్టింది. ఈ కంపెనీలో పనిచేస్తున్న పశ్చిమబెంగాల్‌, బిహార్‌, ఒడిశాకు చెందిన కూలీలు పనులు జరిగే సమీపంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం కూలీలు పనిలోకి వెళ్లగా ఒక గుడిసెలో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు సమీపంలో ఉన్న వందకుపైగా గుడిసెలకు వ్యాపించాయి.

అప్రమత్తమైన కూలీలు మంటలను కంపెనీ వాహనాల సహాయంతో నీళ‍్లు తెచ్చి ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. రెండు ఆవులు మృత్యువాత పడ్డాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌పై ఏం చేద్దాం?

కరోనా : ఆ 99మందిని వారి స్వదేశానికి తరలించారు

తెలంగాణలో 404కు చేరిన కరోనా పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో 23 రోజుల పసికందుకు కరోనా

కూలీలకు సహాయంగా అనురాగ్‌ సంస్థ

సినిమా

రూ.1.25 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అజిత్‌

టిక్‌టాక్ వీడియోపై ర‌ష్మి ఆగ్ర‌హం

క‌రోనా : న‌టి టిక్‌టాక్ వీడియో వైర‌ల్‌

నటుడి కుటుంబానికి కరోనా.. ధైర్యం కోసం పోస్టు!

మాస్క్‌లు వ‌దిలేసి, చున్నీ క‌ట్టుకోండి: విజ‌య్

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిఖిల్‌..