13న బడ్జెట్‌!

1 Mar, 2017 06:07 IST|Sakshi
13న బడ్జెట్‌!

9 లేదా 10 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 9 లేదా 10 నుంచి ప్రారంభం కాను న్నాయి. 13న అసెంబ్లీ బడ్జెట్‌ను ప్రవే శపెడతారు. అయితే సమావేశాల తేదీలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 10 నాటికి బడ్జెట్‌ ముద్రణ ప్రతులను సిద్ధం చేయాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మార్చి 8 నుంచి సమావేశాలు ప్రారంభించి, 10న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథ మికంగా తేదీలను ఖరారు చేసింది. కానీ బడ్జెట్‌ తుది కసరత్తులో జాప్యం జరగడంతో సమావేశాలు ఒకట్రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి.

బడ్జెట్‌కు తుది కసరత్తు: శాఖలవారీగా తమకు అందిన ప్రతిపాదనలతో పాటు ఇటీ వల వరుసగా జరిగిన సమీక్షల్లో సీఎం చేసిన సూచనలకు అనుగుణంగా ఆర్థిక శాఖ అధికా రులు బడ్జెట్‌కు తుది రూపమిచ్చే పనిలో ఉన్నారు. శాఖలు, పథకాల వారీగా కేటా యింపులు కొలిక్కిరావటంతో సీలింగ్‌ బడ్జెట్‌ ను ఖరారు చేశారు. అన్ని శాఖలు, హెచ్‌వోడీ లకు బుధవారం సాయంత్రంలోగా సీలింగ్‌ బడ్జెట్‌ వివరాలను అందించాలని నిర్ణయించా రు. ఆ బడ్జెట్‌కు అనుగుణంగా శాఖలు ఇచ్చే సమాచారంతో తుది కేటాయింపులు, బడ్జెట్‌ పద్దులు రూపొందిస్తారు. అనంతరం బడ్జెట్‌ ప్రతుల ముద్రణకు కనీసం వారం పడుతుం దని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఆర్థిక శాఖకు పోలీస్‌ భద్రత...
సచివాలయంలోని డీ బ్లాక్‌లోని ఆర్థిక శాఖకు ప్రభుత్వం పోలీస్‌ భద్రతను ఏర్పాటు చేసిం ది. మంగళవారం నుంచి గేట్లను మూయటం తోపాటు ప్రధాన ద్వారం వద్ద పోలీసులను కాపలాగా ఉంచింది. బడ్జెట్‌ తయారీ విభా గంలో పనిచేసే అధికారులు, సిబ్బంది విధు లకు ఆటంకం కలుగకుండా సందర్శకులు, మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించింది.

సంక్షేమానికే పెద్దపీట: మంత్రి ఈటల
అణగారిన వర్గాలను ఆదుకునేలా బడ్జెట్‌ ఉం టుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ‘‘19–20 శాతం ఆర్థికవృద్ధి ఉంది. అదే స్థాయిలో బడ్జెట్‌ కూడా పెరుగుతుంది. జీఎస్‌టీ, నోట్ల రద్దు ప్రభావం ఉన్నా గత బడ్జెట్‌ కంటే ఈసారి బడ్జెట్‌ భారీగానే ఉంటుంది..’’ అని చెప్పారు. మంగళవారం సచివాలయంలో ట్రెజరీ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘కొత్త రాష్ట్రంలో ప్రజలు చాలా ఆశలు, ఆకాంక్షలతో ఉన్నారు. వాటన్నింటినీ నెరవేర్చడానికి మనం కృషి చేయాలి. ఆర్థిక ప్రగతిలో దేశంలో నంబర్‌ వన్‌ స్థానం సంపా దించుకున్నాం. దీన్ని నిలబెట్టుకోవాలి. కష్టప డి పనిచేయాలి’’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు