రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి | Sakshi
Sakshi News home page

రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి

Published Wed, Mar 1 2017 4:32 AM

రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కండి - Sakshi

లండన్‌లో ఎన్నారైలకు కవిత పిలుపు.. రాష్ట్రానికి తిరిగొచ్చిన ఎంపీ

రాయికల్‌/సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం లండన్‌లో జరిగిన ఎన్నారై టీఆర్‌ఎస్‌యూకే కార్యవర్గ సమావేశంలో కవిత మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా పోరును ఉధృతం చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్, ఉపాధ్యక్షుడు దూసరి అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం
కామన్వెల్త్‌ మహిళా పార్లమెంట్‌ సదస్సులో పాల్గొన్న కవిత లండన్‌ నుంచి మంగళవారం రాష్ట్రానికి తిరిగివచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆమెకు వీఆర్‌ఏ సంఘం అధ్యక్షుడు రమేశ్‌ బహదూర్‌ ఆధ్వర్యంలో వీఆర్‌ఏలు ఘనస్వాగతం పలికారు. తమ వేతనాల పెంపునకు కృషి చేసిన కవితకు తాము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వీఆర్‌ఏలు అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement