మంత్రి దత్తాత్రేయ సెల్ఫోన్ దొంగ అరెస్టు

31 May, 2016 16:44 IST|Sakshi
మంత్రి దత్తాత్రేయ సెల్ఫోన్ దొంగ అరెస్టు

ముషీరాబాద్:  కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సెల్ఫోన్ ను చోరీ చేసిన ఘనుడుని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. సరూర్‌నగర్‌కు చెందిన గుమ్మడి రాజ్‌కుమార్(52) శ్రీశైలంలో దర్శనం పాస్‌ల కోసం ఈనెల 15 వతేదీ రామ్‌నగర్‌లోని దత్తాత్రేయ ఇంటి వెళ్లాడు. అయితే ముందు రోజు రాత్రి వీచిన గాలులకు చెట్టు విరిగి పడిపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  దాంతో దత్తాత్రేయ సెల్ఫోన్ ను చార్జింగ్ కోసం ఆయన ఇంటి ముందు ఉన్న ఓ గదిలో పెట్టారు.

ఆ సమయంలో మంత్రి ఇంట్లో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉండటంతో... అదే అదునుగా భావించిన రాజ్ కుమార్ సెల్ ను  చోరీ చేశాడు. కొద్దిసేపటి తర్వాత చూస్తే సెల్‌ఫోన్ కనిపించపోవడంతో మంత్రి పీఏ యుగేందర్ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
 

మరిన్ని వార్తలు