కొత్త జాతీయ రహదారులకు డీపీఆర్‌లు

17 Apr, 2017 03:11 IST|Sakshi
కొత్త జాతీయ రహదారులకు డీపీఆర్‌లు

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా మంజూరైన జాతీయ రహదారులకు డీపీఆర్‌లు రూపొందించేందుకు టెండర్ల అనుమతులు, కొత్త రహదారులకు డీపీఆర్‌ కోసం అనుమతులు కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్ర భూ ఉపరితల రవాణా శాఖకు జాబితా అందించనుంది. ఈమేరకు రోడ్లు భవనాల శాఖ జాతీయ రహదారుల విభాగం ఈఎన్‌సీ గణపతిరెడ్డి సోమవారం జాబితా తీసుకుని ఢిల్లీ వెళ్లనున్నారు. 2017–18 సంవత్సరానికి గాను ఎన్‌హెచ్‌డీపీ కింద రూ.4,470 కోట్ల విలువైన పనులకు సంబంధించి ఈ జాబితా రూపొందించారు.

ఇందులో వరంగల్‌–ఖమ్మం సెక్షన్, ఘట్‌ కేసర్‌ ఆరు వరుసల రోడ్డు, ఆరాంఘర్‌–శంషాబాద్‌ రోడ్డు విస్తరణ, ఎల్‌బీనగర్‌ ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు, హైదరాబాద్‌–శ్రీశైలం రోడ్డు మెరుగుపరిచే పనులు ఉన్నాయి. ఇక కొత్త రహదారుల డీపీఆర్‌లకు సంబంధించి... బోధన్‌– బాసర–భైంసా, మెదక్‌–ఎల్లారెడ్డి– బాన్సువాడ–రుద్రూర్, భద్రాచలం– అశ్వారావుపేట, చౌటుప్పల్‌–షాద్‌నగర్, మెదక్‌ –ఎల్కతుర్తి, తాండూరు– కొడంగల్‌–మహబూబ్‌నగర్, జహీరాబాద్‌–బీదర్‌ లైన్‌లు, కొత్త రహదారుల నిర్మాణం కోసం... హైదరాబాద్‌–నర్సాపూర్‌–మెదక్, జహీరాబాద్‌–బీదర్, సిరిసిల్ల–కామారెడ్డి, సిద్దిపేట–ఎల్కతుర్తి, బాసర–భైంసా, బైపాస్‌ల కోసం జడ్చర్ల, మహబూబ్‌నగర్, మెదక్‌ బైపాస్‌లు, రహదారి భద్రత చర్యలు, మియాపూర్‌–బీహెచ్‌ఈఎల్, పుణె–హైదరాబాద్, హైదరాబాద్‌–శ్రీశైలం రోడ్లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు