కుమార్తె మృతి తట్టుకోలేక తండ్రి బలవన్మరణం

14 Sep, 2016 22:07 IST|Sakshi

చిలకలగూడ: కుమార్తె మృతితో మనస్తాపానికి గురైన తండ్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం.. పార్శిగుట్ట సంజీవపురానికి చెందిన పి.బాలకృష్ణ (30), లలిత దంపతులకు కుమార్తెలు పవిత్ర (9), ప్రత్యుష (8) సంతానం. అస్వస్థతలో గతనెల 12న  చిన్న కుమార్తె పవిత్ర మృతి చెందింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలకృష్ణ అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 13న లలిత కుమార్తెను తీసుకుని రాంనగర్‌లో ఉండే సోదరి ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆమె 14వ తేదీ ఉదయం తన ఇంటికి వచ్చేసరికి తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా బాలకృష్ణ చున్నీతో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఊరేసుకొని మృతి చెంది ఉన్నాడు. భార్య ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. కుమార్తె చనిపోవడంతో మనస్తాపానికి గురై బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు