హైదరాబాద్ లో ఫ్రీ పార్కింగ్‌ స్థలాలివే...

1 Jan, 2016 10:41 IST|Sakshi
హైదరాబాద్ లో ఫ్రీ పార్కింగ్‌ స్థలాలివే...

ఉప్పల్‌కు చెందిన అరుణ్ ఉదయమే టిఫిన్ తెద్దామని సమీపంలోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌కు వెళ్లాడు... బైక్ రోడ్డు మీద పెట్టి టిఫిన్‌కు వెళ్లడంతో అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయింది.  నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులకు తలకు మించిన భారమైంది...ఇది ఒక్క ఉప్పల్‌లోనే కాదు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య ఉంది. అయితే జీహెచ్‌ఎంసీ పార్కింగ్ కాంట్రాక్టర్లమంటూ ఎక్కడ సందు దొరికితే అక్కడ వసూళ్ల పర్వం కొనసాగిస్తుండటంతో చాలా మంది ద్విచక్రవాహనదారులు తమ వాహనాన్ని రహదారులపైనే పార్కు చేసి వెళ్తున్నారు. 

నో పార్కింగ్ జోన్‌లో వందల సంఖ్యలో వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనిపై అధ్యయనం చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ‘ఫ్రీ పార్కింగ్’ సౌకర్యాన్ని కల్పించారు. మాదాపూర్, కూకట్‌పల్లి, మియాపూర్, అల్వాల్, బాలానగర్, జీడిమెట్ల, ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 49 ప్రాంతాలను గుర్తించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు.  సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ స్థలాలను శుభ్రం చేసి పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎటువంటి రుసుం లేకుండా ఇక్కడ బైక్‌లు, కార్లను పార్క్ చేసుకోవచ్చు.

ఇవీ ఫ్రీ పార్కింగ్ స్థలాలు...
మాదాపూర్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో: మాదాపూర్‌లోని అవసా హోటల్, ప్రైడ్ హోండా, హైటెక్స్ జంక్షన్‌కు వెళ్లే సీఐఐ, ఇమేజ్ గార్డెన్, కొండాపూర్‌లోని హర్ష టయోటా, కొత్తగూడలోని రత్నదీప్ సూపర్ మార్కెట్, శిల్పరామం నైట్ బజార్‌కు ఎదురుగా ఫోర్‌వీలర్స్‌ను పార్కింగ్ చేసుకోవచ్చు.

కూకట్‌పల్లి ఠాణా పరిధిలో...
 జేఎన్‌టీయూ రైతు బజార్  సమీపంలో ద్విచక్ర వాహనాలు, రైతు బజార్‌కు ఎదురుగా బైక్‌లు, కారులు, రెడీమేడ్ ఆస్పత్రి సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ రోడ్డు నంబర్ 3లో ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు.  

మియాపూర్ పరిధిలో:

చందానగర్‌లోని మైత్రి ఆస్పత్రి నుంచి ఈనాడు బ్యాంక్, అంగర హోటల్ నుంచి కేఎస్ బేకర్స్, గంగారామ్‌లోని చెన్నై షాపింగ్ మాల్ నుంచి నీల్‌కమల్ ఫర్నిచర్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు.

అల్వాల్ ఠాణా పరిధిలో...
సుచిత్ర జంక్షన్, కొంపల్లిలోని బర్టన్‌గూడ జంక్షన్, ఏఎంఆర్ గార్డెన్‌లో బైక్‌లు, ఫోర్ వీలర్స్, ఓల్డ్ అల్వాల్‌లోని లైబ్రరీ బిల్డింగ్ ఎదురుగా, కుత్బుల్లాపూర్ మీ సేవా రోడ్డు సమీపంలో బైక్‌లు పార్క్ చేసుకోవచ్చు.

బాలానగర్ ఠాణా పరిధిలో...
బీబీఆర్ హాస్పిటల్, బొజయ్ గార్డెన్ ఓల్డ్, శోభనా, నర్సాపూర్ ఎక్స్ రోడ్డులోని రామ్ హోండా, బాలానగర్ టీ జంక్షన్‌లోని గణేశ్ మెడికల్ షాప్, మల్లికార్జున లాడ్జి రాజుకాలనీలో కమాన్ , ఫెరోజ్‌గూడ ఎస్‌బీహెచ్ ఎదురుగా బైక్‌లు పార్క్ చేసుకోవచ్చు,

జీడిమెట్ల ఠాణా పరిధిలో...
జీడిమెట్ల ఐడీఏలోని జేఎస్‌ఆర్ కాంప్లెక్స్, షాపూర్‌నగర్‌లోని కిరణ్మయి హాస్పిటల్, రంగ.. భుజంగ థియేటర్ సమీపంలోని విఘ్నేశ్వర కాంప్లెక్స్, ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, గాజులరామారం ఎక్స్ రోడ్డులోని ఉషోదయ టవర్స్, షా సినీ ప్లానెట్‌లోని వాల్యూమార్ట్, గణేశ్‌నగర్‌లోని గౌరి వైన్స్ కాంప్లెక్స్, క్యూకాటన్ బిల్డింగ్, ఐడీపీఎల్ ఎక్స్ రోడ్డులోని భాగ్యరథీ డిగ్రీ కాలేజి బిల్డింగ్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద బైక్‌లు, ఫోర్‌వీలర్స్ నిలుపవచ్చు.

ఉప్పల్ ఠాణా పరిధిలో...
రామంతాపూర్ చెరువు సర్వీసు రోడ్డు, యూనియన్ బ్యాంక్ సమీపంలోని ఉప్పల్ ఎక్స్ రోడ్డు, సర్వీసు రోడ్డులోని ఆర్‌టీఓ కార్యాలయం ఎదురుగా  బైక్‌లు, ఫోర్‌వీలర్స్ నిలుపవచ్చు.

మాల్కాజిగిరి ఠాణా పరిధిలో...
మల్కాజిగిరి ఎక్స్ రోడ్డులోని గాంధీ పార్క్ వాల్ రోడ్డు, ఆనంద్‌బాగ్ నుంచి ఉత్తమ్‌నగర్ వరకు బైక్‌లు, ఫోర్‌వీలర్స్ నిలుపవచ్చు. నేరేడ్‌మెట్ ఎక్స్‌రోడ్డు, ఏఎస్‌రావ్ నగర్‌లోని కెనడీ హైస్కూల్, వెర్టక్స్ ప్లాజా, నార్త్ కమలానగర్‌లోని ఉడ్ ల్యాండ్స్ హోటల్, కుషాయిగూడ మార్కెట్, కమలానగర్‌లోని కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు.

ఎల్బీనగర్ ఠాణా పరిధిలో...
దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా గుడి, కొత్తపేటలోని రైతు బజార్, రాజేంద్రనగర్‌లోని ఆర్‌డీఓ ఆఫీసు వద్ద బైక్‌లు పార్క్ చేయవచ్చు.

మరిన్ని వార్తలు