హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ అస్తవ్యస్తం

28 Jun, 2016 10:55 IST|Sakshi
హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ అస్తవ్యస్తం

హైదరాబాద్: సోమవారం సాయంత్రం నుంచి కురుస్తున్న వర్షంతో నగరం తడిసిముద్దయింది. వర్షాలతో జనజీవనం అస్తవస్త్యమైంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపైకి చేరుకున్న వరద నీటి కారణంగా మంగళవారం ఉదయం వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలతో రోడ్లపైకి వచ్చిన నగర వాసులు ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకున్నారు. ముఖ్యంగా.. పంజాగుట్ట, మోడల్ హౌస్, ఆలుగడ్డబావి, మెట్టుగూడ, మలక్‌పేట్, తార్నాక, హబ్సిగూడ, శ్రీనగర్ కాలనీ, తిరుమలగిరి, బేగంపేట్, రాజ్‌భవన్ రోడ్డు ప్రాంతాల్లో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మరో వైపు కూకట్‌పల్లి జేఎన్‌టీయూ మీదుగా హైటెక్ సిటీకి వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవటంతో ఉదయం 8.30 నుంచి ఈ మార్గంలో వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. హైటెక్‌సిటీతో పాటు మాదాపూర్, గచ్చిబౌలికి వెళ్లేవారికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మరిన్ని వార్తలు