బోగాపురం భూ సేకరణపై హైకోర్టు స్టే

25 Jan, 2016 16:21 IST|Sakshi

భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణపై హైకోర్టు స్టే విధించింది. భూ సేకరణకు వ్యతిరేకంగా 12 గ్రామాల ప్రజలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు భూ సేకరణపై  స్టే విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దీంతో విజయనగరం జిల్లా కలెక్టర్ ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ నిలిచిపోనుంది.
కాగా.. భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం  5,315 ఎకరాల భూమి కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేసింది.దీనికి వ్యతిరేకంగా.. అప్పటి నుంచి ఎయిర్ పోర్టు పరిసర ప్రాంతాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూ సేకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీసిందంటూ ఆరోపించారు. భోగాపురానికి కేవలం45 కిలో మీటర్ల దూరంలో విశాఖ ఎయిర్ పోర్టు ఉండగా.. భోగాపురం ఎయిర్ పోర్టు దేనికని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎయిర్ పోర్టు లండన్ హిత్రూ కేవలం 3వేల ఎకరాలు కాగా.. భోగాపురం ఎయిర్ పోర్టుకు 5వేలకు పైగా ఎకరాలు ఏం చేసుకుంటారని అన్నారు.

మరిన్ని వార్తలు