మహారాష్ట్రకు తాకట్టు: మధు యాష్కీ

23 Aug, 2016 02:08 IST|Sakshi
మహారాష్ట్రకు తాకట్టు: మధు యాష్కీ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మహారాష్ట్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టే చెత్త ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ అన్నారు. పార్టీ అధికార ప్రతినిధి జగ్గా రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడారు. రైతుల ఉసురు పోసుకుంటున్న సీఎం కేసీఆర్‌కు పాపం తగులుతుందని హెచ్చరించారు.

సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కవితలు కమీషన్ల కోసం డిజైన్లు మార్చారని ఆరోపించారు. వీరంతా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. భూ నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం పునరావాసం కల్పించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. జీఓ 123 ప్రకారం భూసేకరణ చెల్లదని కోర్టులు తీర్పు ఇచ్చినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం సిగ్గులేకుండా అప్పీలుకు వెళ్తోందన్నారు.

మరిన్ని వార్తలు