ప్రజల హక్కుల్ని హరిస్తే ఎలా సారూ!

11 Jan, 2018 01:44 IST|Sakshi

 సీఎం కేసీఆర్‌కు మానవ హక్కుల వేదిక బహిరంగలేఖ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో నిర్బంధ పరిస్థితులు నెలకొన్నాయని, అవి ప్రజలకు ఆందోళనకరంగా ఉన్నాయని మానవ హక్కుల వేదిక పేర్కొంది. ప్రత్యామ్నాయ ఆలోచనల పట్ల, ప్రజల అభిప్రాయాల వ్యక్తీకరణపట్ల ప్రభుత్వం తీవ్ర అసహనంతో వ్యవహరిస్తోందని వేదిక అధ్యక్షుడు గొర్రెపాటి మాధవరావు, ప్రధానకార్యదర్శి జి.మోహన్‌ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వతీరుపై మానవ హక్కుల వేదిక సీఎం కేసీఆర్‌కు బుధవారం బహిరంగ లేఖ రాసింది. ప్రివెంటివ్‌ డిటెన్షన్, బహిరంగసభలు, ఊరేగింపులను క్రమబద్ధీకరించే చట్టాలైన సెక్షన్‌ 30, సెక్షన్‌ 144ను పోలీసులు విచక్షణారహితంగా అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా మీటింగులకు అనుమతినివ్వడం లేదని, రైతు సమస్యలపై నిరసన తెలిపినా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు